హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీకి భారీగా ఇసుక ఆదాయం... వారం రోజుల్లో ఎంత వచ్చిందో తెలుసా..

ఏపీకి భారీగా ఇసుక ఆదాయం... వారం రోజుల్లో ఎంత వచ్చిందో తెలుసా..

ఏపీకి ఇసుక ద్వారా వచ్చే ఆదాయంపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి ఇసుక ద్వారా వచ్చే ఆదాయంపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి ఇసుక ద్వారా వచ్చే ఆదాయంపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌ను కొన్ని నెలల పాటు వేధించిన ఇసుక కొరత ఇప్పుడిప్పుడే తీరుతోంది. ఇసుక కొరతను అధిగమించి... అందరికీ ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం చట్టంలో మార్పులు కూడా చేసింది. ఈ క్రమంలో ఏపీకి ఇసుక ద్వారా వచ్చే ఆదాయంపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల్లో ఇసుక అమ్మకాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ. 63 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది అంతా చూస్తే ఇది వేల కోట్లకు చేరుతుందని ఆయన వెల్లడించారు.

    ఈ క్రమంలోనే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.63 కోట్ల ఆదాయం వచ్చిందని... ఏడాది అంతా చూస్తే ఇది వేల కోట్లకు వెళ్తుందని ట్వీట్ చేశారు. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్ళింది చంద్రబాబు' అంటూ ప్రశ్నించారు. పచ్చ ఇసుక మాఫియా ద్వారా ఇన్నాళ్లు మీకు వాటా ముట్టిందని, అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం ముఖ్యమంత్రి సీఎం జగన్ 14400 కాల్ సెంటర్‌ను ప్రారంభించారని... ఇటువంటి సాహసం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయలేక పోయిందని కొనియాడారు.

    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Ap new sand policy, TDP, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు