Home /News /andhra-pradesh /

AP POLITICS YSRCP MP VIJAYASAI REDDY MEETS PRIME MINSTER NARENDRA MODI THERE IS ANY POLITICAL REASONS NGS

MP Vijayasai Reddy meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విజయసాయి.. భేటీకి కారణం అదేనా?

ప్రధాని మోదీ ఎంపీ విజయసాయి రెడ్డి సమావేశం

ప్రధాని మోదీ ఎంపీ విజయసాయి రెడ్డి సమావేశం

MP Vijayasai Reddy meets PM Modi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొత్త పొత్తుల దిశగా అడుగులు పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రధాని మోదీని కలవడం రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.

ఇంకా చదవండి ...
    YSRCP MP Vijayasai Reddy meets PM Modi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు 2024 ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు పొత్తుల దిశగా కదులుతూనే.. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల వ్యూహాలకు ధీటుగా అధికార పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) స్వయంగా కీలక సూచనలు చేశారు. ఇకపై ప్రజల్లోనే ఉండాలని ప్రజా ప్రతినిధులకు స్పష్టం చేశారు. కష్ట పడ్డవారికే సీట్లు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు మంత్రి వర్గ విస్తరణపైనా ఫోకస్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts).. పరిపాలన వికేంద్రీకరణ ఇలా అన్ని విషయాల్లో స్పష్టంగా ఉన్నారు. ఇలా ఏ పార్టీని చూసినా.. అన్ని ఎన్నికల మూడ్ లోనూ కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy).. ప్రధాని మోదీ (Prime minster Modi)ని కలవడం రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.

    తాజాగా వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశాను అని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా ప్రధానితో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి (Andhra Pradesh) రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై.. రావాల్సిన నిధులపై ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయసహకారాలు అందించాలని మోదీని కోరారు. ఏపీలోని సమస్యలతోపాటు పెండింగ్ నిధులు, హామీలపై చర్చించినట్టు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్ చేసి వెల్లడించారు.



    ప్రధానిని కలిసిన సందర్భంగా ఆయన వినాయకుడి ప్రతిమను బహూకరించారు. దీంతోపాటు ప్రధాని మోదీని శాలువాతో సత్కరించారు. కాగా.. రాష్ట్రంలో బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన అధినేత అధినేత పవన్ తో కలిసి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను గద్దె దించడమే లక్ష్యమని చెపుతున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రధాన్యం సంతరించుకుంది.

    ఇదీ చదవండి ఈ చేప చిక్కతే అదృష్టమే? ఎంత ధర పలికిందో తెలుసా..? ప్రత్యేకతలేంటి..?

    ఈ భేటీ మర్యాదపూర్వకంగానే అని విజయసాయి రెడ్డి చెప్పినా.. ఢిల్లీ వర్గాలు మాత్రం రాజకీయ అంశాలపై చర్చించడానికే కలిశారని అంటున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి.. బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయన్నది క్లారిటీ వచ్చేసింది. అయితే పవన్ మాత్రం.. టీడీపీని కూడా కలుపుకొని వెళ్లాలి అని యోచనలో ఉన్నారు. బీజేపీ పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. మూడు పార్టీలు కలిసి బరిలో దిగితే కొంత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అదే విషయం వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నివేదికలో కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. విజయసాయి రెడ్డి ప్రధానిని కలిసి.. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటుందని.. రాజకీయంగా సహకారమందిస్తుందని వివరించడానికే ఆయన కలిశారనే ప్రచారం ఉంది.. వైసీపీ వర్గాలు మాత్రం అలాంటిది ఏమీ లేదంటున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Pm modi, Vijayasai reddy, Ycp

    తదుపరి వార్తలు