Home /News /andhra-pradesh /

AP POLITICS YSRCP MP VIJAYASAI REDDY MADE STRONG COMMENTS ON TDP CHIEF CHANDRABABU NAIDU AFTER PLENARY FULL DETAILS HERE PRN

Vijayasai Reddy: బాబుకు చిప్ జారిపోయింది.. వారి నవరంధ్రాలు బ్లాక్.. విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్..

ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ప్లీనరీ (YSRCP Plenary) గ్రాండ్ సక్సెస్ అయిందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) అన్నారు. ప్లీనరీ సమవేశాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయన్న ఆయన., కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని అభిప్రాయపడ్డారు.

ఇంకా చదవండి ...
  వైఎస్ఆర్సీపీ ప్లీనరీ (YSRCP Plenary) గ్రాండ్ సక్సెస్ అయిందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) అన్నారు. ప్లీనరీ సమవేశాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయన్న ఆయన., కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని అభిప్రాయపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. బాబుది నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అని సైకో పాత్, శాడిస్టు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు మెదడుకు ఉండాల్సిన చిప్ వేలికి వచ్చిందని ఎద్దేవ చేశారు. నవ రంధ్రాలు మూసుకున్నవారే నవరత్నాలపై నవ సందేహాలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిదానికీ ప్రజలను నిందించే బాబు రాజకీయాల్లో ఉండటానికే అనర్హుడుంటూ విజయసాయి అగ్రహం వ్యక్తం చేశారు.

  పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగిన తీరు.. చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా మిగిలిపోతాయనడంలో సందేహం లేదన్నారు విజయసాయి రెడ్డి. పార్టీ అధ్యక్షులును జీవిత కాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం సువర్ణ అధ్యాయమన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలేవీ నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో నిర్వహించిన ఈ ప్లీనరీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందన్నారు. సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర, గడప గడపకు ప్రభుత్వం, జాబ్‌ మేళాలు.. ఇలా అన్ని కార్యక్రమాలు పార్టీలోను, క్యాడర్‌లోనూ కొత్త ఉత్సాహం నింపాయన్నారు.

  ఇది చదవండి: మరో మూడు రోజులు అలర్ట్.. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వానముప్పు


  ఆర్బీకేలు, వాలంటీర్‌ వ్యవస్థ, వైద్య, విద్యా రంగాల్లో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రపంచం అంతా ప్రశంసిస్తుంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శించడం అతడి భావ దారిద్ర్యానికి నిదర్శమని విజయసాయి రెడ్డి విమర్శించారు. “చంద్రబాబు వేలికి ఒక చిప్‌ ఉందట. మెదడుకు ఉండాల్సిన చిప్‌ ఇప్పుడు వేలికు వచ్చేసింది. ఈ వేలు నుంచి చిన్నగా మోకాలులోకి వస్తుంది. మరో ఆర్నెలు, ఏడాదిలోపు అక్కడ నుంచి భూమిలోకి పడిపోతుంది. ఇప్పటికే మతిభ్రమించిన వ్యక్తి చంద్రబాబు. అల్జిమర్స్‌తో బాధపడుతూ కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాడు. 2024 తర్వాత పూర్తిగా మెదడు పనిచేయదు. చంద్రబాబు ఏమైపోతాడా అనే భయం వాళ్ళ పార్టీలో ఉంది. టీడీపీ మహానాడులు, మా పార్టీ ప్లీనరీని పోల్చి చూస్తే... టీడీపీ మహానాడులో బూతులు తిట్టడం, తొడలు కొట్టడం, వైయస్సార్‌ సీపీని శాపనార్ధాలు పెట్టడం అనేది ఒక ప్రధాన ఘట్టంగా జరిగింది.” అని సాయి రెడ్డి అన్నారు.

  ఇది చదవండి: ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. బుక్స్ ధర తగ్గించిన ప్రభుత్వం.. వివరాలివే..!


  ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలను కొంతమంది విమర్శిస్తున్నారని.., న్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95శాతం ఏవిధంగా అమలు చేశామనేది మా ప్లీనరీ సమావేశాలకు వచ్చినవారిని చూసి, నవరత్నాలును విమర్శించినవారి నవరంధ్రాలన్నీ కూడా మూతపడ్డాయన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, మిగతా పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సాయి రెడ్డి జోస్యం చెప్పారు.  చంద్రబాబు నార్సిసిస్టిక్‌ పర్సనాల్టీ అనే వ్యాధితో బాధపడుతున్నారని.., నెగిటివ్‌ భావాలతో తీవ్రమైన మానసిక అలజడికి లోనైన వ్యక్తని విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కూడా చంద్రబాబు అర్హుడు కాదని..., రిటైర్‌ అయిపోతే ఆంధ్రరాష్ట్రానికి, ప్రజలకు మంచిదని భావిస్తున్నాని ఆయన అన్నారు. ఇక విజయమ్మ రాజీనామాపైనా విజయసాయి స్పందించారు. రాజీనామా గురించి విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పారని.., ఒకేసారి రెండు పార్టీల్లో పదవుల్లో ఉండటం సరికాదని, తెలంగాణలో షర్మిలమ్మ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అక్కడ తన అవసరం ఉందని వెళ్తుందని చెప్తే.. దానికి కూడా రాజకీయ రంగు పులమడం అనేది సైకో పాత్‌ చంద్రబాబుకే సాధ్యమైందని ఆయన విమర్శించారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Ysrcp

  తదుపరి వార్తలు