హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఇదేం సలహా నిత్య కళ్యాణం గారూ ?... వైసీపీ ఎంపీ కామెంట్స్

ఇదేం సలహా నిత్య కళ్యాణం గారూ ?... వైసీపీ ఎంపీ కామెంట్స్

పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

  మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేముందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైనా చేసుకోవచ్చని పవన్ సలహా ఇస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా 'నిత్య కళ్యాణం'గారూ ? అంటూ ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్లు, వివాహ వ్యవస్థపై గౌరవం లేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరని అన్నారు. అతిగా ఊహించుకోవద్దని పవన్ కళ్యాణ్‌కు సూచించారు.

  పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం... అందుకు పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. తన మూడు పెళ్లిళ్ల కారణంగానే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా ? అంటూ జగన్‌పై విమర్శలు గుప్పించారు. కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని... మిమ్మల్ని ఎవరు కాదన్నారని సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Janasena, Pawan kalyan, TDP, Vijayasai reddy, Ysrcp

  ఉత్తమ కథలు