హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: వల్లభనేని వంశీ, కొడాలి నాని జూమ్ ఎంట్రీపై క్లారిటీ.. అందుకే వచ్చారన్న విజయసాయి రెడ్డి

AP Politics: వల్లభనేని వంశీ, కొడాలి నాని జూమ్ ఎంట్రీపై క్లారిటీ.. అందుకే వచ్చారన్న విజయసాయి రెడ్డి

ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ విజయసాయి రెడ్డి

పదో తరగతి పరీక్ష ఫలితాలపై (AP 10th Results 2022) రాజకీయ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ పాఠశాలలకు స్థాయికి దీటుగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అమ్మఒడి (Ammavodi), నాడు-నేడు కార్యక్రమాలను ప్రవేశపెట్టినా.. ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి.

ఇంకా చదవండి ...

    పదో తరగతి పరీక్ష ఫలితాలపై (AP 10th Results 2022) రాజకీయ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ పాఠశాలలకు స్థాయికి దీటుగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అమ్మఒడి (Ammavodi), నాడు-నేడు కార్యక్రమాలను ప్రవేశపెట్టినా.. ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఈ సమయంలోనే టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించడం.. అదే మీటింగ్‌‌లో మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (MLA Vallabhaneni Vamsi) సడెన్ ఎంట్రీ ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే.. వంశీ, నాని జూమ్ మీటింగ్‌కి ఎందుకు రావాల్సి వచ్చిందనే దానిపై రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ (YSRCP) కీలక నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) స్పష్టతనిచ్చారు.

    పదో తరగతి ఫలితాలపై పిల్లల తల్లిదండ్రులు, పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ పెట్టి లోకేశ్ అవాస్తవాలు చెబుతున్నారని.. అందుకే తమ పార్టీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎంటరవ్వాల్సి వచ్చిందంటూ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షా ఫలితాలను కూడా టీడీపీ తమ రాజకీయానికి వాడుకోవడం దురదృష్టకరమంటూ ఆయన విచారించారు. ఎన్టీఆర్ జిల్లా (NTR District) లో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. టీడీపీ నేతలు ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని.. దాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ విజయసాయి హెచ్చరించారు.

    ఇది చదవండి: ఇక జనంలోకి జనసేనాని.., దసరా నుంచి పవన్ యాత్ర.. వివరాలివే..!


    ప్రజాస్వామ్యహితంగా పోరాడలేకే తెలుగుదేశం పార్టీ ఇలాంటి చర్యలకు ఒడిగడుతోందని.. ఈ దుష్ట సంప్రదాయాన్ని ఆపకుంటే తగిన గుణపాఠం చెబుతామంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల నేపథ్యంలో నారా లోకేశ్ చేసిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని.. చర్చిందేందుకు తమ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారంటూ ప్రతి సవాల్ విసిరారు. 2024 ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ పూర్తి విశ్వాసంతో ఉందని.. టీడీపీ భవితవ్యం కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనే తెలిసిందంటూ ఆయన ఎద్దేవా చేశారు.


    ఇది ప్రజల ప్రభుత్వమని.. అందుకే టీడీపీకి కడుపుమంట అని సాయిరెడ్డి అన్నారు. కుప్పంలో కూడా ఓడిపోయిన పార్టీ టీడీపీ అని.., ఆత్మకూరులో పోటీ చేసి తన సత్తా ఏంటో నిరూపంచుకోవాలని సవాల్ చేశారాయన. అన్నా క్యాంటిన్ పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఉండాలిగానీ.. ఇబ్బందిపెట్టేలా ఉండకూడదన్నారు. టెన్త్ విద్యార్థులు ఫెయిల్ అయితే కారణాలు తెలుసుకోవాలిగానీ.. సీఎంని తిట్టడమేంటని విజయసాయి ప్రశ్నించారు. చేసిన ప్రతి విమర్శకు బదులు తెల్లిస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారాయన.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు