హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Political Survey: ఏపీలో ఆ రెండు పార్టీలు కలిస్తే వార్ వన్ సైడే.. వైసీపీ ఎంపీ షాకింగ్ సర్వే.. పూర్తి వివరాలివే..!

AP Political Survey: ఏపీలో ఆ రెండు పార్టీలు కలిస్తే వార్ వన్ సైడే.. వైసీపీ ఎంపీ షాకింగ్ సర్వే.. పూర్తి వివరాలివే..!

 చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం పొత్తుల గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జనసేన-టీడీపీ (Janasena-TDP Alliance) కలిసి బరిలో దిగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అటు అధికార వైసీపీ (YSRCP) మాత్రం రెండోసారి గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

M Bala Krishna, News18, Hyderabad

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం పొత్తుల గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జనసేన-టీడీపీ (Janasena-TDP Alliance) కలిసి బరిలో దిగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అటు అధికార వైసీపీ (YSRCP) మాత్రం రెండోసారి గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఐతే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే వార్ వన్ సైడేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnam Raju) వ్యాఖ్యానించారు. తాను విస్తృత సాయి శాంపిల్స్ తో శాస్త్రీయంగా జూన్, జులై మొదటి వారం వరకు నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)కి 93 స్థానాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న స్థానాలలో సగం స్థానాలో విజయం సాధించిన, ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్లు ఉన్న 65 స్థానాలలో వైసీపీ 90% స్థానాలలో విజయం సాధించినా కేవలం 73 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

పలు ఇంగ్లీష్ చానల్ నిర్వహించిన సర్వేను చూసి వైసీపీ నేతలు ధీమాకి పోతే పరిస్థితి మరింత అధ్వానంగా దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు . జిల్లాల వారీగా సర్వే పరిశీలిస్తే ప్రకాశం జిల్లా (Prakasham District) లో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా తలపడే అవకాశం ఉన్నదన్నారు. అనంతపురంలో టీడీపీ మెజార్టీ స్థానాలలో ఏకపక్ష విజయం సాధించనున్నదని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం అధికంగా ఉన్నదన్న ఆయన, గుంటూరులోనూ విజయ అవకాశాలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రభావితం చేయగలరని చెప్పారు. టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్న స్థానాలలో ఆ రెండు పార్టీల అభ్యర్థులు అవలీలగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఇది చదవండి: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ లో కీలక మార్పులు.. వివరాలివే..!


ఇటీవల పలు ఛానళ్ళు బుల్లి, బుల్లి శాంపిల్స్ తో సర్వే నిర్వహించి తమ పార్టీకి 18 నుంచి 23 లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడంతో, తమ పార్టీ నేతలు 175 కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని భావించి ఇంకా ఎక్కువ దారుణాలు చేయడం, సర్వే ఫలితాలను చూసి పనిచేయడం మానేస్తే పరిస్థితి మరింత అద్వానంగా ఉంటుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. ఐతే వైసీపీకి రెబల్ గా మారిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. టీడీపీకి అనుకూలంగా మాట్లాడటం సాధారణమేనని వైసీపీ నేతలంటున్నారు. తమ పార్టీకి జనంలో ఆదరణ ఉందని.. మరోసారి అధికారం తమదేనని చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, MP raghurama krishnam raju

ఉత్తమ కథలు