హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP: తనయుడి పొలిటికల్ ఎంట్రీపై తేల్చేసిన వైసీపీ ఎంపీ.. జగన్ అనుమతి తీసుకున్నారా ?

YSRCP: తనయుడి పొలిటికల్ ఎంట్రీపై తేల్చేసిన వైసీపీ ఎంపీ.. జగన్ అనుమతి తీసుకున్నారా ?

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

AP Politics: వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని ఆయన ప్రకటించడంతో.. మాగుంట ఈ విషయంలో ఎవరి అనుమతి తీసుకున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజకీయాల్లోకి తమ వారసులను తీసుకొచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది నాయకులు విజయవంతంగా తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. వాళ్లు సక్సెస్ అందుకునేలా చేశారు. తాజాగా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి(Magunta Srinivasulu Reddy) కూడా అదే ప్లాన్‌లో ఉన్నారు. ఈ విషయంపై ఆయన కొద్దిరోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. ఒంగోలు నుంచి ఎంపీగా పలుసార్లు పోటీ చేసి విజయం సాధించిన మాగుంట శ్రీనివాసులురెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని తేల్చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై(Delhi liquor Scam) తమ పేరు కూడా ఉందని వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి.. తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీ విషయంలోనూ స్పష్టత ఇచ్చారు.

  అయితే మాగుంట ప్రకటనతో రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. మాగుంట కోసం ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని పక్కనపెట్టి మరీ ఆయనకు సీటు ఇచ్చారు సీఎం జగన్(YS Jagan Mohan Reddy). అయితే వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన మాగుంటకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పెద్దగా పొసగడం లేదనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆయన మరోసారి పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్టు ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ తనకు అలాంటి ఆలోచన లేదని మాగుంట క్లారిటీ ఇచ్చారు.

  అయితే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని ఆయన ప్రకటించడంతో.. మాగుంట ఈ విషయంలో ఎవరి అనుమతి తీసుకున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుడు రాఘవను ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకుంటే.. ఇందుకోసం ఆయన ప్రస్తుతం ఉన్న వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించిన సీఎం జగన్ మాగుంటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? లేదా ? అన్నది ఆ పార్టీ నేతలకు అర్థంకావడం లేదు. అయితే పనితీరుపై సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్లు కేటాయిస్తానని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు.

  Flexi Warning: అమరావతి రైతులకు వార్నింగ్.. మా జోలికి వస్తే ఎగరేసి నరుకుతాం.. గుడివాడలో ఫ్లెక్సీల కలకలం

  Breaking News: ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్.. అందరికీ పెన్షన్లు పెంపు.. ఎంతంటే?

  ఈ నేపథ్యంలో సీఎం జగన్ ముందుగానే మాగుంటకు ఈ విషయంలో హామీ ఇచ్చే అవకాశం లేదని కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యల ద్వారా వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడే ఎన్నికల్లో పోటీ చేస్తారనే సంకేతాలను మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీ నాయకత్వానికి ఇచ్చారేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు వైసీపీ ఒప్పుకోకపోతే టీడీపీ నుంచి ఆయన తన తనయుడిని పోటీ చేయించే అవకాశం లేకపోలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వైసీపీ ఎంపీ తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసురావాలని నిర్ణయం తీసుకోవడం.. దాన్ని ప్రకటించడం ఆసక్తిరేపుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, AP News, Ysrcp

  ఉత్తమ కథలు