జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై వైసీపీ (YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదని.. వారిని వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి పవన్‌కళ్యాణ్‌ది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నలుగురిని పెళ్లి చేసుకున్న పవన్, వారికి అన్యాయం చేశారని.. ఆయన మహిళల భద్రత గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా విమర్శలు మానుకోవాలని.. లేకపోతే భవిష్యత్తులో మహిళలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు పోతుల సునీత. మూడేళ్లలో మహిళల ఆర్థిక, సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేశారన్నారు.
మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్న పవన్‌కళ్యాణ్, తన వ్యక్తిగత జీవితంలో వారికి ఎంత గౌరవం ఇచ్చారనేది అందరూ చూడాలని.. ఆయనకు కుటుంబం అన్నా, వివాహ బంధమన్నా ఏ మాత్రం నమ్మకం, బాధ్యత లేద విమర్శించారు. పవన్‌కళ్యాణ్ నిజ జీవితంలో కూడా సినిమాల్లో మాదిరిగా హీరోయిన్లతో పాటలు పాడి, డైలాగ్‌లు చెప్పినట్లు వ్యవహరించారని ఆరోపించారు. పవన్‌కళ్యాణ్ నలుగురిని పెళ్లి చేసుకున్నాడని.., దీన్ని బట్టి మహిళలను ఎలా గౌరవిస్తున్నాడనేది అర్థం అవుతుందని మండిపడ్డారు. ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్. ఇప్పుడు ఇంకొకరితో పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోందంటూ పోతుల సునీత తీవ్రవ్యాఖ్యలు చేశారు.
“ఒక దుశ్శాసనుడు, ఒక కీచకుడు మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో.. మహిళల రక్షణ గురించి పవన్‌కళ్యాణ్ మాట్లాడితే అలాగే ఉంటుంది. నిజానికి పవన్‌కళ్యాణ్ దగ్గరే మహిళలకు రక్షణ లేదు. ఎవరైనా ఆయన దగ్గరకు పోవాలంటే వారికి రక్షణ కావాల్సి ఉంది.” అని పోతుల సునీత అన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు.. పిల్లలకు బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని హోం మంత్రి మాట్లాడితే, ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ దాన్ని తప్పు పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ జరిగిందని.., ఎమ్మార్వో వనజాక్షికి అవమానం జరిగితే పవన్ ఎందుకు మాట్లాడలేదన్నారు.
వైసీపీ 151 సీట్లు గెల్చుకుని అధికార దర్పంతో వ్యవహరిస్తోందని పవన్ ఆరోపిస్తున్నారని.. కానీ ఈ ప్రభుత్వం పూర్తి సేవాభావంతో పని చేస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ ఇలాగే మాట్లాడుతూ పోతే, భవిష్యత్తులో మహిళలే ఆయనకు తగిన బుద్ధి చెబుతార వార్నింగ్ ఇచ్చారు. మహిళలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని.. 2024 ఎన్నికల్లో కూడా మహిళలంతా ఆయన వెంటే ఉంటారని పోతుల సునీత ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena party, Ysrcp