Home /News /andhra-pradesh /

AP POLITICS YSRCP MLC LELLA APPIREDDY SLAMS TDP OVER ILLICIT LIQUOR ALLEGATIONS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

YCP vs TDP: చంద్రబాబుకు కొత్త నిక్ నేమ్.. జే బ్రాండ్ వైసీపీ ఇచ్చిన అర్ధం ఇదే..!

చంద్రబాబు, జగన్ (ఫైల్)

చంద్రబాబు, జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో లిక్కర్ వార్ మరింత ముదురుతోంది. అసెంబ్లీ లోపల, బయట వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ చేస్తున్న కల్తీ మద్యం, జే బ్రాండ్ విమర్శలకు ఏకంగా సీఎం జగన్ (AP CM YS Jagan) నేరుగా కౌంటర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో లిక్కర్ వార్ మరింత ముదురుతోంది. అసెంబ్లీ లోపల, బయట వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ చేస్తున్న కల్తీ మద్యం, జే బ్రాండ్ విమర్శలకు ఏకంగా సీఎం జగనే నేరుగా కౌంటర్ ఇచ్చారు. తాజాగా వైసీపీ నేతలు చంద్రబాబుకు నిక్ నేమ్ పెడుతూనే.. టీడీపీ చేస్తున్న జే బ్రాండ్ ఆరోపణలకు ధీటుగా బదులిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు సభ్యులు పెద్దల సభ పరువు తీస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. చర్చకు బదులుగా రచ్చ చేస్తూ సభ్యసమాజం సిగ్గుతో తల దించుకునేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే అంశాన్ని పట్టుకుని వారం రోజుల నుంచి సభ సజావుగా జరగకుండా గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. అసలు సారా గురించి మాట్లాడే నైతికత టీడీపీ సభ్యులకు లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎందుకంటే... నారా చంద్రబాబునాయుడు నిక్‌నేమ్‌ సారా చంద్రబాబు అని అప్పిరెడ్డి స్పష్టం చేశారు.

    ఎన్టీఆర్ విధించిన సంపూర్ణ మధ్య పాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు... చీప్‌ లిక్కర్‌ సృష్టికర్త చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అలాంటి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ సారా గురించి మాట్లాడడం, నల్ల కండువాలతో శాసనమండలి వేదికగా నిరసన తెలపడం, జే బ్రాండ్లు అంటూ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

    ఇది చదవండి: అలా చెప్తే రాజకీయాలు వదిలేస్తా.. సీఎంకు అచ్చెన్న సవాల్.. ముదిరిన లిక్కర్ వార్..


    జే అంటే జగన్... జగన్ బ్రాండ్‌ అంటే అభివృద్ధి–సంక్షేమం అని అప్పిరెడ్డి తెలిపారు. జగన్‌ మార్కు పాలన సాగుతున్న రాష్ట్రంలో మహిళా భద్రతకు ఉద్ధేశించి దిశ, తమ పిల్లల ఉన్నత భవిత కోసం తల్లులకు ఇస్తున్న అమ్మఒడి, విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం పలికిన నాడు–నేడు, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ, గ్రామ సచివాలయాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రైతులకు భరోసా, బడుగులకు చేయూత, దేశ చరిత్రలోనే ఎక్కడా ఎరుగని రీతిలో సాకారమవుతున్న పేదల సొంతింటి కల తదితర ప్రగతి పధకాలన్నీ జగన్ బ్రాండ్లని లేళ్ళ అప్పిరెడ్డి ప్రకటించారు.

    ఇది చదవండి: ఏపీలో ఎమ్మెల్యేలు, లీడర్లు, అధికారుల ఫోన్లు బిజీ.., కారణం తెలిస్తే షాక్ అవుతారు..!


    ఏలూరులో జరిగిన సహజ మరణాలను అడ్డం పెట్టుకుని సభలో వారు చేస్తున్న అల్లరి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం హయాంలో స్వయంగా ఎక్సైజ్ మంత్రి జవహర్ బీరు తాగడం మంచిదేనని చేసిన వ్యాఖ్యలను అప్పిరెడ్డి గుర్తు చేశారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే దశలవారీ మద్య నిషేదం దిశగా ముందడుగు వేశామని.., అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్టుషాపుల బెండు తీసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇక పుట్టగొడుగుల్లా ఉన్న బార్లు, మద్యం దుకాణాలకు మూత వేయించి సారా అమ్మకాలను నియంత్రించామని ఆయన అన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, TDP, Ysrcp

    తదుపరి వార్తలు