ఏపీ రాజధాని గురించి హాట్ హాట్ చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. అమరావతిని కాదని, విశాఖలో పరిపాలన రాజధానిని పెట్టాలని, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు యోచిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన డిమాండ్‌ను బయటపెట్టారు. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత పీవీ సిద్దా రెడ్డి అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి అమరావతిని మాత్రమే అభివృద్ధి చేసే బదులు, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయవచ్చని చెబుతూనే.. అనంతపురంలో అసెంబ్లీని పెట్టి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
కాగా, అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటల్‌గా, విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ టీడీపీ సహా ఇతర పార్టీలు, అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Anantapur S01p19, Ap capital, Ap cm ys jagan mohan reddy, AP News, Ysrcp