GT Hemanth Kumar, News18, Tirupati
వైసీపీ (YSRCP) లో ఉన్న ఎమ్మెల్యేలలో ఆయన స్టైల్ ఏ వేరు. తాను ఏడుమాట్లాదిన సెన్సేషన్.... ఏది చేసిన బ్రేకింగ్.... మంత్రి పదవి రాకపోతే చిన్నపిల్లాడిలా కంట తడి పెట్టుకున్న నేత అతను. కానీ కష్టం అని వచ్చిన వారిని దాతృత్వంతో ఆదుకొనే మనస్సుఅతనిది. వివాదాలకు మాత్రమే కేర్ అఫ్ అడ్రస్ కాదు... ప్రజలను ఆదుకొనే ఆపద్బాంధవుడు అని పేరు తెచ్చుకుంటున్నారు నెల్లూరు (Nellore) రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇంతకి ఆయన ఏంచేశారంటే.., నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy) జగనన్న మాట.. గడప గడపకి కోటం రెడ్డి బాట అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోను తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
నెల్లూరు రూరల్ మండలంలోని కొత్త వెల్లంటి గ్రామంకు కోటం రెడ్డి బాట కార్యక్రమం చేరుకుంది. అదే గ్రామంలో అంధురాలైన కామాక్షి ఇంటికి వెళ్ళారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ప్రభుత్వ పధకాలను ఆమెకు వివరిస్తూనే... ఆమె సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. అందుకు కామాక్షి తనకు వచ్చిన కష్టాన్ని ఎమ్మెల్యేతో చెప్పుకొనే ప్రయత్నం చేస్తూ కన్నీరుమున్నీరు అయింది. రెండేళ్ల కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురైన కామాక్షి.... ఆసుపత్రి పాలయ్యానని ఆవేదన వ్యక్తంచేసింది. అదే సమయంలో తనకు కళ్ళు రెండు చూపు కోల్పోయాయని ఎమ్మెల్యేకు చెప్పి తన బాధను వెళ్లగక్కుకుంది.
ఆమె బాధకు చలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నీకు కళ్ళు తెప్పించే బాధ్యత నాదే అంటూ కామాక్షికి చేతిలో చేయి పెట్టి ఒట్టు వేసారు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. తనకు కావాల్సిన సౌకర్యాలను పీఏ దగ్గరుండి చేసుకొనేలా ఏర్పాట్లు చేసారు. వైద్య పరీక్షల అనంతరం కామాక్షి కంటికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. 18 ఏళ్ళ యువతికి 13 ఏళ్ళ క్రితం పోయిన కంటి చూపు.., తిరిగి వచ్చేలా చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రయత్నం హర్షణీయం. తాను విద్యాదాల్లోనే కాదు.., ప్రజలకు అండగా ఉడటంలోనూ ముందుంటాని ఆయన నిరూపించారు.
ఇది చదవండి: గెలిచే పార్టీలనే పీకే ఎంచుకుంటున్నాడా..? అసలు వ్యూహం ఇదేనా...?
రాజకీయ నాయకులు ఇచ్చే హామీలకు గ్యారెంటీ లేదనే చెడ్డపేరు చాలా చోట్ల ఉంది. ఓట్లు అడిగేందుకు, పర్యటనలకు వచ్చినప్పుడు హామీలివ్వడం సర్వసాధారణం. ఆతర్వాత వాటిని పట్టించుకునేవాళ్లు చాలా తక్కువ. కానీ కోటంరెట్టి మాత్రం ఇచ్చిన మాటను నాలుగు రోజుల్లోనే నిలబెట్టుకొని యువతికి కంటిచూపునందించారు. ఎమ్మెల్యే తనకు పునర్జన్మను ప్రసాదించారని యువతి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kotamreddy sridhar reddy, Nellore Dist