Home /News /andhra-pradesh /

AP POLITICS YSRCP MLA KOLUSU PARTHASARATHI SLAMS CHANDRABABU NAIDU AND TDP LEADERS OVER NEW LIQUOR BRANDS IN AP FULL DETAILS HERE PRN

AP Politics: బూమ్ బూమ్ బాబు, టీడీపీ ప్రెసిడెంట్ మెడల్.., ఏపీలో మద్యం బ్రాండ్లపై వైసీపీ కౌంటర్ ఎటాక్..

చంద్రబాబు, జగన్ (ఫైల్)

చంద్రబాబు, జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మద్యం చుట్టూ తిరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెం ఇష్యూ తర్వాత అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మద్యం చుట్టూ తిరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెం ఇష్యూ తర్వాత అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అమ్ముడవుతున్న మద్యం బ్రాండ్లపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడున్న బ్రాండ్లకు టీడీపీ హయాంలోనే అనుమతులు ఇచ్చారంటూ వైసీపీ కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టింది. అంతేకాదు అవన్నీ టీడీపీ నేతలకు, వారి బంధువులకు చెందిన కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయంటూ మరో సంచలనానికి తెరతీసింది. శనివారం మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వైసీపీ ప్రభుత్వానికి కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అవన్నీ బీ- బ్రాండ్లు.. చంద్రబాబు బ్రాండ్లు.. సీ- బ్రాండ్లేనని.. "ప్రెసిడెంట్ మెడల్ - గవర్నర్స్ రిజర్వ్- బూమ్ బీరు" ఇవన్నీ చంద్రబాబు-టీడీపీ ప్రభుత్వం తెచ్చినవే.. ఈ మెడల్స్ అన్నీ బాబు మెడలోనే వేయాలని పార్థసారధి ఎద్దేవా చేశారు.

    అవన్నీ టీడీపీ వారివే..!
    చంద్రబాబుకు శ్రీమాన్ మద్య మహా చక్రవర్తి - మద్య మహా సామ్రాట్ అని బిరుదులివ్వాలంటూ సెటైర్లు వేశారు.” మద్యం ఉత్పత్తి చేస్తున్న విశాఖ డిస్టలరీస్ అయ్యన్నపాత్రుడిది కాదా..?; పీఎంకే డిస్టలరీస్ యనమల రామకృష్ణుడు వియ్యంకుడిది కాదా...? శ్రీకృష్ణా డిస్టలరీస్ ఆదికేశవుల నాయుడిది కాదా..?; ఎస్పీవై డిస్టలరీస్ ఎస్పీవై రెడ్డిది కాదా...? వీరంతా టీడీపీ వారు కాదా..? వీటిని తయారు చేస్తున్నది.. ఇడుపులపాయలోనా..? లేక చంద్రబాబు "ముడుపుల పాయ"లోనా..?” అని పార్థసారధి ప్రశ్నించారు.

    ఇది చదవండి: ఏపీలో మద్యపాన నిషేధం సాధ్యమేనా..? ఆ విషయంలో జగన్ సర్కార్ ఫెయిల్ అయిందా..?


    రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్ గా చంద్రబాబు నాయుడు, టీడీపీ కార్యాలయం మారిపోయిందని., గోబెల్స్‌ కంటే ఘోరంగా అబద్దాలును నమ్మశక్యంగా ప్రచారం చేయగల దిట్ట చంద్రబాబు అని పార్థసారధి మండిపడ్డారు. జే బ్రాండ్స్‌ అంటూ బ్రాడింగ్‌ చేయడంలో చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్స్ రిజర్వ్... ఇలా గవర్నర్ నుంచి ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా వరకూ ఎవరినైనా చంద్రబాబు వాడేస్తారని పార్థసారధి అన్నారు.

    ఇది చదవండి: మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్న జగన్.. ఈసారి కూడా వర్కవుట్ అవుతుందా..?


    టీడీపీ హయాంలోనే అనుమతులు
    2019 తర్వాత ఒక్క డిస్టలరీకిగానీ, ఒక బ్రూవరీకిగానీ జగన్ గారి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదుని., లిక్కర్ తయారీకి సంబంధించిన పాలసీలో .. 2019 తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం ఎటువంటి మార్పులూ చేయలేదని పార్థసారధి స్పష్టం చేశారు. .సప్లయర్లు వారి రేట్ కాంట్రాక్టు అగ్రిమెంట్లను పొడిగించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ప్రెసిడెంట్ మెడల్ అనే బ్రాండ్ కు 2018 ఫిబ్రవరి 6న, ఇక గవర్నర్స్ రిజర్వ్ బ్రాండ్ కు 2018 నవంబరు 5న, గవర్నర్ పేరు మీద ఉన్న ఇతరత్రా బ్రాండ్లు, నెపోలియన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు, ఓక్టన్ పేరు మీద బ్రాండ్లు, సెవెన్త్ హెవెన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు... వీటన్నింటికీ 2018 అక్టోబరు 26న, ప్రెసిడెంట్ మెడల్ తోపాటు, హైదరాబాద్ విస్కీ బ్రాండ్లకు 2017 నవంబరు 22న, బూమ్ బూమ్ బీర్ కు 2019 మే 14న, అలాగే, హై ఓల్టేజి గోల్డ్ బీరు, ఎస్ ఎన్ జే బీరు, బ్రిటీష్ ఎంపయర్ బీరు.. 2017 జూన్ 7న.., అలాగే, రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు, లూహీ - 14 బ్రాండ్లు, సైనవుట్ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతులిచ్చినట్లు పార్థసారధి ఆరోపించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, TDP

    తదుపరి వార్తలు