Home /News /andhra-pradesh /

AP POLITICS YSRCP MINSTERS BUS YATRA WILL STARTS TODYA FROM SIRKAKULAM VAI RAJHMUNDRA TO ANANTAPURAM NGS VZM

Ministers: నేటి నుంచి జనంలోకి మంత్రులు.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వయా రాజమహేంద్రవరం.. పొలిటికల్ రూట్ మ్యాప్ ఇదే

నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర

నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర

Ministers Bus Yatra: గడప గడపకు మంత్రులు బ్రేకులు వేశారు.. నేటి నుంచి బస్పు బాట పడుతున్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం పేరుతో మంత్రులు జనంలోకి వెళ్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో వివరించడంతో పాటు.. మళ్లీ జగన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఏంటి అన్నది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు వివరించనున్నారు.

ఇంకా చదవండి ...
    Ministers Bus Yatra: ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గడప గడపకు ప్రభుత్వం పేరుతో జనంలోకి వెళ్తున్నారు. అయితే ఇందులో కొందరు మంత్రులు ఆ కార్యక్రమానికి  బ్రేక్ ఇచ్చి.. మరో యాత్రకు సిద్ధమయ్యారు. సామాజిక న్యాయభేరి పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.  వైసీపీ (YCP). బడుగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, జగన్ ప్రభుత్వం (Jagan Government) అందిస్తున్న సంక్షేమ ఫలాలను ఈ బస్సు యాత్ర (Bus Yatra)లో ఆయా వర్గాలకు వివరించనుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు సర్వం సిద్ధం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, కేబినెట్‌లో 17 మంది బడుగు బలహీన వర్గాల నేతలకు మంత్రి పదవులిచ్చారు సీఎం జగన్ (CM Jagan) అనే నినాదం ఆయా మంత్రులంతా బస్సు యాత్ర పేరుతో జనంలోకి వెళ్తున్నారు. ఇదే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రోత్సహించారని ఆయా వార్గాలకు వారికి వెల్లడించనున్నారు. సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా బడుగుల ఉన్నతికి ఉపకరించేలా ప్లాన్ చేసిన విషయాన్ని వారికి చెప్పనున్నారు. ఈ అంశాలన్ని ప్రజలకు వివరించడానికే శ్రీకాకుళం (Srikakulam) నుంచి అనంతపురం (Anantapuram) వరకు వైసీపీ మంత్రుల (YCP Ministers) సామాజిక న్యాయ భేరీ రథం బయలుదేరడానికి సిద్ధమైంది.

    శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ నుంచి నేడు బయల్దేరనున్న మంత్రుల బస్సు యాత్ర, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను చుట్టేసి, గోదావరి తీరం మీదుగా కోస్తాలోకి ఎంటర్‌ అవుతుంది. అక్కడినుంచి రాయలసీమ (Rayala Seema) జిల్లాల్లో ప్రయాణాన్ని సాగించి, అనంతపురం వేదికగా, అనంతమైన గళంతో, సామాజిక న్యాయ గర్జనను వినిపించనున్నారు మంత్రులు. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. యాత్రకు కావాల్సిన బస్‌ను హైదరాబాద్‌ (Hyderabad) లో సిద్ధం చేశారు.

    ఇదీ చదవండి : సీఎం జగన్ దావోస్ పర్య్టటనలో టీడీపీ ఎంపీ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ తో చర్చలు

    ఈ బస్సు యాత్రలో భాగంగా మొదటి బహిరంగ సభను.. విజయనగరం జిల్లాలో నిర్వహించనున్నారు. ఆ తరువాత రాజమండ్రిలో రెండో బహిరంగ సభ, నర్సరావుపేటలో మూడో బహిరంగ సభ, అనంతపురంలో నాలుగో బహిరంగ సభ నిర్వహిస్తారు.. ఇలా నాలుగు బహిరంగ సభలే కాకుండా.. మధ్య మధ్యలో ఆగుతూ అక్కడ బడుగు బలహీన వర్గాల వారితో సమావేశం కానున్నారు. ఈ బస్సు యాత్రలో తమ ప్రభుత్వ హయాంలో బలహీనవర్గాలకు ఉంటున్న ప్రాధాన్యం, అందుతున్న పథకాలను ఆయా వర్గాల వారికి పూర్తిగా వివరించనున్నారు.

    ఇదీ చదవండి : మళ్లీ సెంచరీ.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా..? ప్రత్యామ్నాయం ఇదే..

    ఎక్కడైనా లోటు పాట్లు ఉంటే సరిదిద్దుతామని హామీ ఇవ్వనున్నారు. మంత్రులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు కూడా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కీలక నేతలు, మంత్రులు ఈ బస్సు యాత్ర విజయవంతం అయ్యేలా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

    ఇదీ చదవండి : గంటాలో మార్పుకు కారణం అదేనా.. ఉన్నట్టుండి అధినేతపై పొగడ్తలకు కారణం అదేనా..?

    ఈ బస్సు యాత్రకు చాలా విశేషం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఇలాంటి యాత్రలు ఏవైనా మొదలుపెట్టినప్పుడు... పార్టీ అధినేత, సీఎం ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ పార్టీ అధినేత, సీఎం జగన్ లేకుండా మంత్రులు చేస్తున్న తొలియాత్ర ఇదే.. దీంతో జనం నుంచి స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గడప గడప పేరుతో కొన్ని చోట్ల నిరసన సెగలు తప్పడం లేదు.

    ఇదీ చదవండి : పిచ్చిది అంటూ ఎగతాళి చేశారు.. ఇప్పుడు గుడి కట్టి పూజిస్తున్నారు? అసలేమైంది?

    ఈ బస్సు యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. జనం నుంచి పూర్తి మద్దతు లభించేలాని ఆశిస్తున్నారు. ఆ దిశగానే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏపీ అంతటా సమరభేరీ మోగించడానికి మంత్రులు సిద్దమయ్యారు. మరి ఈ యాత్ర ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరోవైపు ప్రభుత్వంపై ఎలాంటి ఆధరణ ఉంది అన్నది కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు రాజకీయ పార్టీలకు శ్రీకాకుళం జిల్లా సెంటిమెంట్‌ అనే ప్రచారం ఉంది. ఈ యాత్ర కూడా శ్రీకాకుళం నుంచే ప్రారంభం కావడం లక్కీగా చెబుతున్నారు వైసీపీ నేతలు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు