P Anand Mohan, Visakhapatnam, News18
Shock to YCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అప్పుడే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ జనం బాట పడుతున్నాయి. అయితే ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగలు తప్పడం లేదు. ఇప్పటికే టీడీపీ (TDP)కి దివ్యావాణి (Divya Vani) రాజీనామా చేసి.. పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఆ వేడి చల్లారకముందే.. అధికార వైసీపీ (YCP)కి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ లో.. జగన్ సర్కార్ (YCP Government) అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలుగు దేశం (Telugu Desam) నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఫిరాయించారు. వారిలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ (Vasupalli Ganesh) ఒకరు. గత కొంతకాలంగా ఆయన వైసీపీ తీరుపై అసంతృప్తిగానే ఉన్నారు. తాజాగా వైసీపీ ఇచ్చిన.. విశాఖ దక్షిణ వైసీపీ ఇన్ ఛార్జ్ పదవికి గుడ్ బై చెప్పేశారు. దీనికి సంబంధించి పార్టీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కి ఓ లేఖ రాశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్నప్పుడు తాను ఎలా పనిచేశానో, ఆ తర్వాత వైసీపీ పాలనలో జగన్ పనితీరు నచ్చి ఎలా పార్టీలో చేరానన్న విషయాల్ని సుబ్బారెడ్డికి లేఖలో వివరించారు వాసుపల్లి..
ఇటీవల వైవీ సుబ్బారెడ్డి విశాఖకు వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయన లేఖ రాశారు. వైవీ పర్యటన సందర్భంగా తనకు శల్య పరీక్ష పెట్టడం, బల పరీక్షపెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి.. తన గౌరవానికి భంగం కలిగించినట్లుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖ దక్షణ నియోజకవర్గం వైసిపి సమన్వయ కర్త స్థానం నుంచి వైదొలగినట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్వయంగా లేఖ రాశారు. తెలుగు దేశంలో తనను గౌరవంగా చూసుకున్నారని.. అయితే జగన్ సంక్షేమ పథకాలు అమలు చూసి వైసిపి లో పని చెశాను అంటూ లేఖలో గణేశ్ రాశారు.
ఇటీవల తనకు పార్టీలో జరిగిన అవమానాలు భరించలేక సమన్వయ కర్తగా తప్పుకుంటున్నట్లు వాసుపల్లి తన లేఖలో సుబ్బారెడ్డికి వివరించారు. ఇఫ్పటికే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వంశీ, కరణం వంటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ కు ఇది మరో తలనొప్పి తప్పేలా లేదు. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలు చూస్తే.. మళ్లీ టీడీపీకి జంప్ అవుతారని సంకేతాలు అందుతున్నాయి.
ఇదీ చదవండి : రాష్ట్రంలో బీసీ నేతలే లక్ష్యంగా హత్యలు..! శాంతి భ్రదతలు ఎక్కడున్నాయి..? డీజీపీకి చంద్రబాబు లేఖ..?
ఇప్పటికే పార్టీలో పెద్దలతో ఈ విషయంపై హామీ తీసుకున్నట్టు టాక్.. అయితే కేవలం వాసుపల్లి మాత్రమే కాదు.. త్వరలో వైసీపీ నుంచి టీడీపీలో భారీగానే వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వారిలో బుట్టా రేణుక, పార్ధసారధి, మాజీ మంత్రి మేకపాటి సుచరిత, ఆనం రామనారాయణరెడ్డి, కిల్లి కృపారాణితో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు పలువురు మాజీ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు కూడా టీడీపీలో చేరికల కోసం ఎదురుచూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరంతా ముందస్తు ఎన్నికలపై సంకేతాలు వెలువడగానే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నవారైతే పార్టీలో చేరితే తమకు లభించే స్ధానాలు, టికెట్లు ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. వీరంతా నిజంగా చేరితే మాత్రం ఎన్నికలకు ముందు టీడీపీకి భారీ ఊపు వచ్చే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Vizag