హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP-BRS: బీఆర్ఎస్‌పై వైసీపీ అదే రకమైన ఆలోచనతో ఉందా ? వైసీపీ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు

YSRCP-BRS: బీఆర్ఎస్‌పై వైసీపీ అదే రకమైన ఆలోచనతో ఉందా ? వైసీపీ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

AP Politics: కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించలేదు. దీనిపై స్పందించమని విలేఖరులు కోరగా.. ఆయన నవ్వి వెళ్లిపోయారు. తాజాగా వైసీపీ కూడా కేసీఆర్ బీఆర్ఎస్‌ను సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తన సారథ్యంలోని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే.. టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ అవుతుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏపీ రాజకీయ పార్టీలు పెద్దగా రియాక్ట్ కావడం లేదని తెలుస్తోంది. నిన్న కేసీఆర్(KCR) బీఆర్ఎస్ ఏర్పాటు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించలేదు. దీనిపై స్పందించమని విలేఖరులు కోరగా.. ఆయన నవ్వి వెళ్లిపోయారు. తాజాగా వైసీపీ (Ysrcp) కూడా కేసీఆర్ బీఆర్ఎస్‌ను సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తూనే ఉంటాయన్న ఆ పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ పార్టీ గురించి విశ్లేషించాలని తాము అనుకోవడం లేదని అన్నారు. అదే సమయంలో రాజకీయ ఎత్తుగడల కోసం వైసీపీ ఏర్పడలేదని.. పరోక్షంగా బీఆర్ఎస్(BRS) రాజకీయ ఎత్తుగడలో భాగమే అన్నట్టుగా కామెంట్ చేశారు.

  ఇక వైసీపీలోని మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సైతం బీఆర్ఎస్‌ను లైట్ తీసుకున్నారు. ఒకవేళ ఆ పార్టీ ఏపీలోకి వస్తే.. రాష్ట్రంలోని అనేక పార్టీల్లో అది కూడా ఒకటిగా మారుతుందని కామెంట్ చేశారు. దీన్ని బట్టి బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌ను ఏపీలోని వైసీపీ సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ సైతం ఏపీ వైపు ఇప్పుడే ఫోకస్ చేయడం లేదని తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర తమ మొదటి కార్యక్షేత్రాలని ప్రకటించి ఏపీపై తాము ఎక్కువగా ఫోకస్ చేయడం లేదని సంకేతాలు ఇచ్చారు.

  కేసీఆర్ ప్రకటనతో ఏపీలోని రాజకీయ పార్టీలకు కొంత ఊరట లభించినట్టు అయ్యిందని కొందరు భావిస్తుంటే.. వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఏపీ పేరు ప్రకటించలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా ఏపీలో రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే.. ఏపీలోని రాజకీయ పార్టీలు కూడా అందుకు తగ్గట్టుగానే కౌంటర్ ఇస్తాయని.. గతంలో ఆయన ఏపీ విషయంలో అనుసరించిన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే కేసీఆర్‌కు ఏపీలో లాభం జరగకపోతే లేనిపోని కొత్త తలనొప్పులు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందనే వాదన కూడా ఉంది.

  BRS In AP: ఏపీలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. వెలసిన ఫ్లెక్సీలు.. కేసీఆర్ టార్గెట్ ఎవరు.. టచ్ లో ఉన్నది ఎవరు?

  KCR: కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ చేయడం లేదా ?.. ఆ మాటలకు అర్థమేంటి ?

  ఈ కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొత్త జాతీయ పార్టీ విస్తరణ కోసం కర్ణాటక, మహారాష్ట్రను ఎంచుకున్నారని.. ఈ రెండు ప్రాంతాల్లో తాను ఆశించిన విధంగా పార్టీ విస్తరిస్తే.. ఆ తరువాత ఏపీలో కూడా అనుకున్నట్టుగా జరిగేందుకు అవకాశం లభిస్తుందని కేసీఆర్ ఆలోచించి ఉండొచ్చని అంటున్నారు. బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉన్నా.. ఏపీలోని టీడీపీ , వైసీపీ మాత్రం ఈ పార్టీకి పెద్దగా పట్టించుకోవద్దని డిసైడయినట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Sajjala ramakrishna reddy, Ysrcp

  ఉత్తమ కథలు