హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: వైసీపీ సరికొత్త వ్యూహం.. టీడీపీ, జనసేన పొత్తుపై కీలక చర్చ ?

AP Politics: వైసీపీ సరికొత్త వ్యూహం.. టీడీపీ, జనసేన పొత్తుపై కీలక చర్చ ?

చంద్రబాబు, జగన్, పవన్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, జగన్, పవన్ (ఫైల్ ఫోటో)

AP News: ఈ రకమైన చర్చ జరగడం వల్ల ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఊహాగానాలకు సంబంధించి కొత్త చర్చ మొదలవుతుందని వైసీపీ భావిస్తూ ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై అప్పుడే ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి.. ఆ రెండు పార్టీలు మళ్లీ వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. పొత్తులపై తాను చేసినట్టు వస్తున్న వ్యాఖ్యలను వక్రీకరించారని చంద్రబాబు చెబుతున్నప్పటికీ.. టీడీపీ,(TDP) జనసేన (Janasena) మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరే అవకాశాలే ఎక్కువ అని చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీని ఓడించేందుకు, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంలో త్యాగాలు చేయడానికి కూడా సిద్ధమే అని చంద్రబాబు చేసినట్టు వస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నాయకత్వం కొత్త చర్చకు తెరలేపింది. దీనిపై స్పందించిన ఆ పార్టీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు ఏ రకమైన త్యాగం చేస్తారని ప్రశ్నించారు.

  చంద్రబాబు త్యాగం అంటే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారా ? అని ప్రశ్నించారు. ఒక‌రు త్యాగాల‌కు సిద్ధమని అంటున్నారని.. మరొక‌రు తానే సీఎం అంటున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పొత్తులు క‌రెక్ట్ కాద‌న్న సజ్జల.. జనాలంటే ఆ పార్టీల‌కు చుల‌క‌న అయిపోయారని విమర్శించారు. చంద్రబాబు(Chandrababu Naidu) క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌డుస్తున్నార‌ని.. ప‌వ‌న్ (Pawan Kalyan) డైలాగుల‌న్నీ చంద్రబాబు చెబుతున్నవేనని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని జంప్‌లు చేశారో అంద‌రికీ తెలుసని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పొత్తులోనే ఉన్నార‌ని ఆరోపించారు.

  టీడీపీ, జనసేన పొత్తు పాలిటిక్స్ విషయంలో కొత్త చర్చకు తెరలేపాలనే వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతోందని.. అందుకే టీడీపీతో పొత్తుకు సిద్ధమైన జనసేన విషయంలో పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ముఖ్యమంత్రిని చేస్తారా ? అని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రకమైన చర్చ జరగడం వల్ల ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఊహాగానాలకు సంబంధించి కొత్త చర్చ మొదలవుతుందని వైసీపీ భావిస్తూ ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  Chandrababu: పొత్తులపై యూటర్న్ తీసుకున్నారా..? చంద్రబాబు మాట్లకు అర్థం అదేనా..?

  YS Jagan-Kodali Nani: సీఎం జగన్‌తో కొడాలి నాని సమావేశం.. కారణం ఇదేనా ?.. మాజీమంత్రికి ముఖ్యమంత్రి అలాంటి ఆదేశాలు ఇచ్చారా ?

  మరోవైపు ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన ముందుగానే ఓ అవగాహనకు రావాలనే యోచనలో రెండు పార్టీలు ఉన్నాయని ఆ పార్టీల అధినేతలు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. మరి.. పొత్తుల విషయంలో త్యాగం అంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ విషయంలో వైసీపీ లేవనెత్తిన కొత్త చర్చ ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ysrcp

  ఉత్తమ కథలు