ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో.. ఆ పార్టీ ఓఎమ్మెల్సీ సీటు కోల్పోయింది. దీంతో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరనే వైసీపీ(Ysrcp) నాయకత్వం ఫోకస్ పెట్టింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనే ప్రచారం జరుగుతోంది. అయితే తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ఉండవల్లి శ్రీదేవి వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డవారిని గుర్తించామని వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. అయితే వారి పేర్లు ఇప్పుడు చెప్పబోమని తెలిపారు. సరైన సమయంలో వారిపై చర్యలుంటాయని వ్యాఖ్యానించారు. వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇది రాజకీయమని.. ఉద్యోగం కాదని అన్నారు. తకు సంఖ్యా బలం ఉందనే పోటీ పెట్టామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డిని తాము లెక్కలోకి తీసుకోలేదని సజ్జల చెప్పారు. టీడీపీ వాళ్లు ఎవరిన కొనుగోలు చేసినట్టున్నారని.. తమ వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేశామని అన్నారు. డబ్బులు తప్ప టీడీపీ గెలవడానికి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ సొంతంగా 175 స్థానాలు పోటీ చేయగలదా ? అని సజ్జల మరోసారి ప్రశ్నించారు.
అంతకుముందు ఏపీలో ఉత్కంఠను రేకెత్తించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా... 6 సీట్లను వైసీపీ , ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు.
వైసీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్ (22 ఓట్లు), ఏసురత్నం (22), పోతుల సునీత (22), సూర్యనారాయణరాజు (22), మర్రి రాజశేఖర్ (22) గెలుపొందారు. వైసీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో... రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ అంతిమ విజయం సాధించారు.
Breaking News: జయమంగళం ఓటమికి కారణాలు ఇవే? ఆ ఇద్దరిపై వేటు తప్పదా..? సంబరాల్లో టీడీపీ
Breaking News: వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ గెలుపు
తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) చేతిలో కేవలం 19 ఓట్లు ఉండగానే.. అమెకు ఇప్పటికే 23 ఓట్లు వచ్చాయి.. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలు ఉండడంతో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలి అంటే 22 ఓట్లు సరిపోతాయి. ఇప్పటికే ఆమెకు 23 ఓట్లు రావడంతో ఆమె గెలుపు ఖాయమైంది.. అయితే చేతిలో 19 ఓట్లు ఉంటే.. మరో నాలుగు ఓట్లు అనంగా వచ్చాయి. అందులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayan Reddy) ఓట్లు పడినా.. ఆమె ఓట్ల సంఖ్య 21కి చేరినట్టు. కానీ ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ నుంచి రెండు ఓట్లు ఆమెకు పడ్డాయి. దీంతో వైసీపీ నుంచి ఓట్లు వేసిన ఆ ఇద్దరు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh