తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులపై ఏపీ మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని(Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారని ఆరోపించారు. ఏపీలో కేసీఆర్(KCR) ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలే అని ఆరోపించారు. తెలంగాణ మంత్రులు ఏపీని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. ఏపీకి వెన్నుపోటు పొడిచింది తెలంగాణ(Telangana) నేతలే అని విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో దొంగ కరెంట్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారని.. బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పులేదని ఎద్దేవా చేశారు. ఏపీకి చెందిన తమ ఆస్తులు పంచారా ? డబ్బులు ఇచ్చారా ? అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు విద్యుత్ బకాయిలు కట్టలేదని అన్నారు. ఏపీకి ద్రోహం చేసి ఇప్పుడు మాట్లాడతారా ? అని పేర్ని నాని అన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ భవన్‌కు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ సమక్షంలో వీరు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు.
భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్‌కు చేరుకున్న రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథికి మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయకుడు దాసోజు శ్రవణ్‌తో పాటు పలువురు ఘనస్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు ఏపీకి చెందిన టీజే ప్రకాశ్, తాడివాక రమేశ్ నాయుడు, గిద్దల శ్రీనివాస్ నాయుడు, రామారావు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
Pawan Kalyan: చంద్రన్న కానుకలో తొక్కిసలాటపై పవన్ సంచలన ప్రకటన.. చర్యలు చేపట్టాలని డిమాండ్
AP Politics: టార్గెట్ కేసీఆర్.. జగన్‌కు మాత్రమే అవకాశం.. చంద్రబాబుకు మిస్ చేసుకున్నారా ?
ఇక తన చివరి శ్వాస వరకు కేసీఆర్‌తోనే ఉంటానని ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు స్పష్టం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధితో కలిసి రావెల ఇవాళ హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోందని, కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు తనను ఆకర్షించాయన్నారు. ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్న రావెల.. టీడీపీ , వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని విమర్శించారు. చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని, ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CM KCR, Perni nani