AP POLITICS YSRCP INTERNAL FIGHT BETWEEN THREE MAIN LEADERS IN TEKKALI FROM SRIKAKULAM DISTRICT NGS VZM
Ysrcp Fight: అధికార వైసీపీలో అంతర్గ కుమ్ములాటలు.. ముగ్గురి మధ్య ఆధిపత్య పోరుతో ఇబ్బంది..?
హైకామండ్ కు తలనొప్పిగా టెక్కలి వర్గపోరు
Ysrcp Fight: అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో మూడు వర్గాలు ఉండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎవరికి వారు తమ పట్టు నిరూపించుకునేందుకు పావులు కదుపుతుండడంతో కేడర్ తీవ్ర గందరోగోళానికి గురవుతోంది.. అధిష్టానానికి విషయం చేరినా.. సమస్య కొలిక్కి రావడం లేదు.
Ysrcp Fight: ఇటీవల పలు జిల్లాల్లో గ్రూపు తగాలపై వైసీపీ (YCP) అధిష్టానం ఫోకస్ చేసింది. ఆయా నేతలను పిలిపించి మరి పార్టీ పెద్దలు క్లాస్ పీకారు. ఇందులో భాగంగా ఆ కీలక నియోజవర్గ నేతల వ్యవహారంపై అధినేత వరకు వెళ్లింది. దీంతో అధినేత ఆదేశించారు. అక్కడి నేతలు ఊ కొట్టారు. కలిసి అడుగులు వేస్తామని మాట ఇచ్చేరు.. దీంతో మూడు గ్రూపుల మధ్య వివాదం సద్దుమణిగిందని అంతా కలిసి పని చేస్తారని కేడర్ ఆశించింది.. కానీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. స్థానికంగా మూడు ముక్కలాట మొదలైంది. ఎవరికి వారు తమదే పైచేయి అంటూ పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పెద్దలకు విషయం తెలిసినా.. పరిస్థితి సద్దుమణగడం లేదు. ఎరికి చెబితే ఎవరు అలుగుతారో తెలయని పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతానికి అధిష్టానం చూసి చూడనట్టు వదిలిస్తోంది. ఇదే అదునుగా ఆ ముగ్గురు కీలక నేతలు నియోజకవర్గంలో ఎవరి కార్యచరణను వారు అమలు చేస్తున్నారు. అయితే అందులో ఓ కీలక నే పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీకి కొరుకుడుపడని ఆ నియోజకవర్గం ఏంటి?
ఉత్తరాంధ్ర (Uttarandhra) లో కీలకమైన శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని టెక్కలి (Tekkali) లో ఈ అంతర్గత కుమ్ములాట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఇక్కడ టీడీపీ (TDP) నే గెలిచింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎక్కువగా ఉన్నా… వారి మధ్య ఆధిపత్యపోరు పార్టీకి ప్రతికూలంగా మారింది. ఒకరంటే ఇంకొకరికి గిట్టదు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో పరిస్థితి మారలేదు. నాయకులకు కీలక పదవులు కట్టబెట్టినా నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక మూల అనైక్యత బయట పడుతూనే ఉంది.
ఇటీవలే పార్టీ పెద్దలు టెక్కలి వైసీపీ నేతలు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), కాళింగ కార్పొరేషన్ ఛైర్మణ్ పేరాడ తిలక్ (Perada Tilak) , కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి (Killi Krupa Rani) లు తాడేపల్లికి పిలిచారు. ముగ్గుర్నీకూర్చోబెట్టి గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. నియోజకవర్గంలో కీలక నాయకులు ఇలా ఎవరికివారుగా ఉంటే కుదరబోదని ముఖం మీదే చెప్పినట్టు తెలుస్తోంది. ఇకపై టెక్కలిలో ఎవరు ఏం చేయాలి.. ఎలాంటి డైరెక్షన్లో పనిచేయాలో అని పార్టీ పెద్దలు స్పష్టత ఇచ్చారట.
అయితే పార్టీ పెద్దల దగ్గర తలూపిన టెక్కలి ఆ ముగ్గురు నేతలు.. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కలిసి పని చేయడం లేదనే ప్రచారం ఉంది. ఆ మధ్య ఉగాది సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్వయంగా పేరడ, కిల్లి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఇటీవల గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం మాత్రం ఎవరికి వారే అన్నట్టు నిర్వహించారని ప్రచారం. అంతే కాదు.. ఒకరికి ఒకరు సహకరించుకోవడం లేదనే ప్రచారం కూడా ఉంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.