ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) ప్రకటించారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను(Undavalli Sri Devi) వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు ఈ రకమైన చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. తమకున్న సమాచారం ప్రకారం.. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కొక్కరికి రూ. 10 నుంచి 15 కోట్ల వరకు ఇచ్చి ప్రలోభపెట్టి వారిని కొనుగోలు చేశారని ఆరోపించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారితో తాము మాట్లాడలేదని సజ్జల అన్నారు. ఇది చిన్న విషయం కాదు కాబట్టి.. సీరియస్‌గా చర్యలు తీసుకున్నామని వ్యాఖ్యానించారు.
దీనిపై తాము అంతర్గతంగా విచారణ చేపట్టామని.. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది వారే అని తాము నమ్మిన తరువాతే ఈ రకమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలు చాలా ముందుగానే వచ్చారని.. ఎలాంటి ఎన్నికలు లేని సమయంలోనే బయటకు వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వాళ్లు మాత్రం సందర్బం చూసుకుని పార్టీకి వ్యతిరేకంగా నడుచుకున్నారని ఆరోపించారు.
మరోవైపు వైసీపీ సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాము టీడీపీకి ఓటు వేయలేదని నిన్న వివరణ ఇచ్చారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నిన్న క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారి పేర్లను బయటకు చెప్పబోమని ప్రకటించిన వైసీపీ నాయకత్వం.. ఈ రోజు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్ట ప్రకటించింది.
Minister Roja: ఆ ఇద్దరు చరిత్ర హీనులే.. వచ్చే ఎన్నికల్లో టీడీపికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన రోజా
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జూన్ నెల అంగప్రదక్షిణ టికెట్లు విడుదల
తమ పార్టీ ఈ విషయంలో సాగదీత ధోరణి అవలంభించవద్దని భావిస్తోందని.. అందుకే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని సజ్జల ప్రకటించారు. వైసీపీ నిర్ణయంతో.. చివరి నిమిషంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అనే విషయం తేలిపోయింది. దీంతో వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధమైన వైఖరితో ముందుకు సాగుతారు ? వారిని టీడీపీ తమ పార్టీలో చేర్చుకుంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.