AP POLITICS YSRCP HAS RECORD INCOME AS TDP 100 CR LESS THAN YCP IN POLITICAL DONATIONS AMONG REGIONAL PARTIES IN INDIA FULL DETAILS HERE PRN
YCP-TDP: వైసీపీకి ఆదాయం ఎక్కువ... వ్యయం తక్కువ.., టీడీపీ పరిస్థితి రివర్స్..
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కి అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు వచ్చాయి. ఒక విధంగా 2019 ఎన్నికల్లో అదే బంపర్ మెజారిటీ.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కి అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు వచ్చాయి. ఒక విధంగా 2019 ఎన్నికల్లో అదే బంపర్ మెజారిటీ. తాజాగా పార్టీ కోసం వచ్చిన విరాళాల్లోనూ వైసీపీ రికార్డు సృష్టించింది. టీడీపీ (TDP) కంటే రూ.100 కోట్ల మేర విరాళాలు సాధించింది. ఐతే ఖర్చులో టీడీపీ టాప్ లో ఉండే.. పొదువులో మాత్రం వైసీపీని కొట్టిన పార్టీ లేదు. రాజకీయ పార్టీలకు వివిధ రూపాల్లో విరాళాలు వస్తుంటాయి. వాటిని పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంటాయి. జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలకు కూడా భారీగా విరాళాలు వస్తుంటాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వివిధ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికిసమర్పించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫార్మ్స్ బయటపెట్టింది.
వచ్చిన విరాళాలను ఖర్చు చేయకుండా అట్టిపెట్టుకున్న పార్టీల్లో వైసీపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ పార్టీకి రూ.107.89 కోట్ల విరాళాలు రాగా కేవలం రూ.80 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. ఈ లిస్టులో ఉన్న టీడీపీకి కేవలం రూ.3.25 కోట్లు రాగా.. ఆ పార్టీ రూ.54.76 కోట్లు ఖర్చు చేసింది. 2020-21లో దేశంలోని ప్రాతీయ పార్టీలకు రూ.529.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే పార్టీలకు 2019-20లో ఏకంగా రూ.800.26 కోట్లు వచ్చాయి. అంటే రూ.270 కోట్లు తక్కువ ఆదాయం వచ్చింది.
2020-21లో దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చిన ప్రాంతీయ పార్టీగా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నిలిచింది. ఆ పార్టీకి మొత్తం రూ.149.95కోట్లు రాగా.. రెండో స్థానంలో ఉన్న వైసీపీకి రూ.107.99 కోట్లు వచ్చాయి. వీడిలో రూ.96 కోట్లు విరాళాల రూపంలో రూ.11 కోట్లు ఇతర మార్గాల్లో వచ్చాయి. బీజేడీకి రూ.73.34 కోట్లు, జేడీయూ రూ.65.31 కోట్లు, టీఆర్ఎస్ రూ.37.65 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఎక్కువ ఖర్చు చేయంకుండా మిగుల్చుకున్న పార్టీల్లో వైసీపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. విరాళాల్లో 99శాతం ఖర్చు చేయకుండా అలాగే ఉంచింది వైసీపీ, ఆ తర్వాత బీజేడీ 90.44 శాతం, ఎంఐఎస్ 88.02 శాతం అట్టిపెట్టుకున్నాయి.
దేశంలోని 31 పార్టీలకు రూ.376.86 కోట్లు స్వచ్ఛంద విరాళాల రూపంలో రాగా.. రూ.250.60 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సేకరించాయి. ఈ మొత్తం కేవలం ఐదు పార్టీల ఖాతాల్లోకే వెళ్లాయి. ఇందులో వైసీపీ రూ.96.25 కోట్లు, డీఎంకే రూ.80 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఆప్ రూ.5.95 కోట్లు, జేడీయూ రూ.1.40 కోట్లు వచ్చాయి. ఆయా పార్టీలకు వడ్డీల రూపంలోనే రూ.84.64 కోట్లు వచ్చాయి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.