హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: అమరావతి కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్.. జగన్ థింకింగ్ అలా ఉందా..?

AP Politics: అమరావతి కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్.. జగన్ థింకింగ్ అలా ఉందా..?

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజధాని రాజకీయం జోరందుకుంది. మూడు రాజధానులని అధికార వైసీపీ అంటుంటే.. కాదు అమరావతి (Amaravathi) ఏకైక రాజధానిగా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజధాని రాజకీయం జోరందుకుంది. మూడు రాజధానులని అధికార వైసీపీ అంటుంటే.. కాదు అమరావతి (Amaravathi) ఏకైక రాజధానిగా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం (Viasakhpatnam) లో నాన్ పొలిటికల్ జేఏసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు అధికార వైసీపీనే కర్త కర్మ క్రియ అనేది అందరికీ తెలిసిన నిజమే. ఐతే అమరావతి ఉద్యమానికి సరైన కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ మరో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ నిర్ణయానికి అమరావతితోనే జై కొట్టించే స్కెచ్ వేస్తోంది. అవును రాజధాని ప్రాంతంలోనే తమ బలం నిరూపించేందుకునేందుకు జగన్ అండ్ కో ఓ సూపర్ మార్గాన్ని ఎంచుకుంది.

ఏపీలో ఒకేఒక్క రాజధాని ఉండదని.. మూడు రాజధానులుంటాయని దాదాపు మూడేళ్ల క్రితం అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి రాజధానికి భూములిచ్చిన రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆందోళన బాటపట్టాయి. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. సధీర్ఘ విచారణ అనంతరం కోర్టు అమరావతికే ఓటు వేసింది. అంతేకాదు నిర్ణీత కాలంలో రైతులకు ప్లాట్లు అప్పజెప్పడంతో పాటు రాజధాని పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐతే కోర్టు ఆదేశాలిచ్చినా జగన్ సర్కార్ మాత్రం వెనకడుగు వేయలేదు. నిధుల లేమి, ఇతర కారణాలతో అమరావతిని పక్కనబెట్టేసింది. నిధుల్లేవంటూ రాజధాని పనులను పూర్తిగా పక్కనబెట్టేసింది.

ఇది చదవండి: గన్నవరంలో అక్రమ మైనింగ్.. అసలు నిజం ఇదే..! ఎమ్మెల్యే వంశీ సంచలన కామెంట్స్

అంతేకాదు వికేంద్రీకరణ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరింది. ఓ వైపు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతిలో పట్టుసాధించేందుకు పావులు కదుపుతోంది. అమరావతిని మున్సిపాలిటీగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజాభిప్రాయం తీసుకునే ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వం ఇక అధికారిక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని మూడు పంచాయతీల్ని కలిపి.. మొత్తం 22 పంచాయతీలతో అమరావతిని మున్సిపాలిటిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది చదవండి: అన్‌స్టాపబుల్‌లో అమరావతి.. అప్పుడు బాహుబలి రాలేదు కాబట్టి సరిపోయింది..?

ప్రజాభిప్రాయసేకరణకు అనుకున్నంత స్పందన రాకపోయినా సీఆర్‌డిఎ చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇంతకు ముందే అమరావతి పరిధిలో గ్రామాలన్నిటినీ పురపాలన శాఖ కిందకు తీసుకొచ్చినా పంచాయతీలుగానే ఉన్నాయి. ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీగా మార్చి వెంటనే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఎన్నుకునే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది.

మున్సిపాలిటీగా ఏర్పాటైన ఆరునెలల్లోపే వార్డులు విభజించడం విడగొట్టడం, ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, అమరావతి గ్రామాలతో మున్సిపాల్టీ ఏర్పాటు చేసి అక్కడ గెలవాలనేది వైసీపీ ముందున్న తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది. అక్కడ గెలిచి.. తమ పట్టు నిరూపించుకొనేవాలనేది లక్ష్యంగా ఉంది. అమరావతి ఎన్నికల్లో గెలిచి మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారి నోళ్లు మూయించాలనేది జగన్ టార్గెట్ ‌గా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో అమరావతి ప్రాంతం వైసీపీకి పట్టం కట్టింది. ఐతే ఆ తర్వాత రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన విధానంతో జగన్ అన్నా, అధికార పార్టీ అన్నా అక్కడి ప్రజలు ఇంతెత్తున లేస్తున్నారు. ఈ సమయంలో అమరావతిలో ఎన్నికలు నిర్వహించి గెలవడం అంటే వైసీపీకి పెద్దసవాలే అని చెప్పాలి..!

First published:

Tags: Amaravathi, Andhra Pradesh

ఉత్తమ కథలు