హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP: ఈసారి ఎన్నికల నినాదం ఇదే.. ప్లీనరీ నుంచే ప్రజల్లోకి..! వైసీపీ నేతల కీలక ప్రకటన..

YSRCP: ఈసారి ఎన్నికల నినాదం ఇదే.. ప్లీనరీ నుంచే ప్రజల్లోకి..! వైసీపీ నేతల కీలక ప్రకటన..

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary-2022) కి సిద్ధమవుతోంది. జులై 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లా (Guntur District) లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్లీనరీ నుంచి కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary-2022) కి సిద్ధమవుతోంది. జులై 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లా (Guntur District) లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్లీనరీ నుంచి కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. బుధవారం ప్లీనరీ జరిగే ప్రదేశాన్ని పరిశీలించిన పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కిక్ బాబు.. సర్వ్ ది పీపుల్ అనే నినాదంతో ముందుకెళ్తామని ప్రకటించారు. 2024లో 175 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నవరత్నాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వేద మంత్రాలని., ప్రజల అజెండాపైనే పార్టీ ప్లీనరీలో నిర్ణయాలుంటాయని వైసీపీ నేతలు తెలిపారు.

2017లో ఇదే ప్రాంతంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించిందని.., ఆ ప్లీనరీ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీ 151 స్థానాలతో అఖండ విజయం సాధించిందని విజయసాయి గుర్తుచేశారు. మళ్ళీ, అయిదేళ్ల తర్వాత 2022లో జులై 8,9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నామన్నారు. మళ్లీ అయిదేళ్ల తర్వాత, అంటే 2027లో కూడా అధికారంలో ఉండే మా పార్టీ, అప్పుడు కూడా ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఇది చదవండి: రాష్ట్రాన్ని తగలబెడుతుంటే అడ్డుకున్నా.. అందుకే ఇదంతా..!


‘కిక్‌ ది బాబు అవుట్‌.. గెట్‌ ద పవర్‌ అండ్‌ సర్వ్‌ ది పీపుల్‌’అనే నినాదంతో 2024లో జరిగే ఎన్నికలకు వెళతామని విజయసాయి రెడ్డి తెలిపారు. 175 సీట్లకు 175 సీట్లు కైవసం చేసుకుంటామన్నారు. క్షేత్రస్థాయి నుంచి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల వరకు ఈ ప్లీనరీకి లక్షల సంఖ్యలో హాజరు అవుతారని.., మొదటి రోజు పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఉపన్యాసంతో ప్రారంభమవుతుందని.., మళ్లీ 9న సీఎం జగన్ ముగింపు ఉపన్యాసం ఇస్తారన్నారు. రాబోయే ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.

ఇది చదవండి: కోనసీమలో కొసరు నాయకులు పెత్తనం..! అధికారపార్టీలో చిచ్చు..!


అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మేనిఫెస్టోలో పెట్టిన హామీలను వందకు 95శాతం పూర్తిగా అమలు చేసిన ఘనత, దేశ చరిత్రలో బహుశా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, జగన్‌ కే దక్కుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆచరణలో కూడా ఇంతటి నిబద్ధత కలిగిన నాయకుడితో ప్రయాణం చేస్తున్నందుకు పార్టీ శ్రేణులు నుంచి నాయకులు వరకూ అందరం ఎంతో గర్వపడుతున్నామన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు వారి భావి భవిష్యత్‌ చిత్రపటాన్ని ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం ఈ ప్లీనరీ సమావేశాల్లో జరుగుతుందని సజ్జల తెలిపారు. రాష్ట్ర భవిష్యత్‌, చరిత్ర ఇకముందు అంతా వైయస్సార్‌ సీపీతో కలిసి ముడిపడి ఉందని అబిప్రాయపడ్డారు. ఇప్పుడు అధికారంతో పాటు, రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు. జరిగే ప్లీనరీలో, క్రిందస్థాయి నుంచి వార్డు స్థాయిలో పోటీ చేసిన ప్రతి సభ్యుడిని మా పార్టీ అధ్యక్షుడు జగన్‌ ప్రత్యేకంగా తన సంతకంతో కూడిన లేఖ ద్వారా అందర్నీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తారన్నారు. ఇక ప్లీనరీకి వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హాజరవుతారని సజ్జల, విజయసాయి తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Ysrcp

ఉత్తమ కథలు