Home /News /andhra-pradesh /

AP POLITICS YSRCP GETTING READY FOR FIRST PLENARY AFTER FORMING GOVERNMENT HERE IS THE SCHEDULE OF FIRST DAY FULL DETAILS HERE PRN GNT

YCP Plenary-2022: వైసీపీ ప్లీనరీకి సర్వం సిద్దం.. తొలి రోజు తీర్మానాలు.. షెడ్యూల్ ఇదే..!

వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు

వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary-2022) పండుగకు సిద్ధమవుతోంది. ఈనెల 8,9వ తేదీల్లో రెండు రోజుల పాటు ఘనంగా ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. వైఎస్ఆర్సీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చి జగన్ సీఎం (AP CM YS Jagan) అయిన తర్వాత జరుగుతున్న మొదటి ప్లీనరీ కావడంతో ఎక్కడా తగ్గకుండా పార్టీ పండుగను నిర్వహించేందుకు నేతలు రంగం సిద్ధం చేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary-2022) పండుగకు సిద్ధమవుతోంది. ఈనెల 8,9వ తేదీల్లో రెండు రోజుల పాటు ఘనంగా ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. వైఎస్ఆర్సీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చి జగన్ సీఎం (AP CM YS Jagan) అయిన తర్వాత జరుగుతున్న మొదటి ప్లీనరీ కావడంతో ఎక్కడా తగ్గకుండా పార్టీ పండుగను నిర్వహించేందుకు నేతలు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ప్లీనరీ అజెండాను పార్టీ నేతలు ఖరారు చేశారు. ప్లీనరీ మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ప్లీనరీలో 10 గంటల వరకూ సభ్యులు రిజిస్ట్రేషన్ ఉంటుంది. 10 గంటల 10 నిమిషాలకు అధ్యక్షుడు జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. 10 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధన ఉంటుంది.

    ఇక 10 గంటల 30 నిమిషాలకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సర్వమత ప్రార్థనలుంటాయి. 10.55 నిమిషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు. దీనిని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. సరిగ్గా 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం ఉంటాయి. ఆ తర్వాత పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదించి ఆమెదిస్తారు. 11:35 నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాలను నివేదిస్తారు. ఆ తర్వాత పలు తీర్మానాలను ప్రవేశపెడతారు.

    ఇది చదవండి: ఆ విషయంలో జగన్ ను మెచ్చుకున్న కేంద్రం.. దేశవ్యాప్త అమలుకు సిద్ధం..


    పార్టీ ప్లీనరీలో 11 గంటల 45 నిమిషాలకు మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టంపై చర్చిస్తారు. దీనిపై మంత్రులు ఉషశ్రీ చరణ్, రోజా, ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి ప్రసంగిస్తారు. విద్యపై రెండో తీర్మానం ఉంటుంది. ఈ అంశంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడతారు. 2.15 నిమిషాల నుంచి ఒక పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.



    మధ్యాహ్నం 2:30 కు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పై తీర్మానం ఉంటుంది. దీనిపై మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాతారు. ఆ తర్వాత వైద్యంపై తీర్మానం ఉంటుంది. వైద్యం అంశంపై మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని ప్రసంగిస్తారు. సాయంత్రం నాలుగున్నరకు పరిపాలనా- పారదర్శకత అంశం పై చర్చిస్తారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి మాట్లాడతారు. సాయంత్రం ఐదు గంటలతో తొలిరోజు ప్లీనరీ సమావేశం ముగుస్తుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు