Home /News /andhra-pradesh /

AP POLITICS YSRCP FOCUSED ON MANGALAGIRI AND NARA LOKESH THESE IS THE DETAILS NGS

YCP Focus on Lokesh: నారా లోకేష్ ను టార్గెట్ చేసిన వైసీపీ.. మంగళగిరిలో పట్టు బిగించే దిశగా వ్యూహాలు

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

YCP Focus on Lokesh: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టార్గెట్ మార్చిందా.. మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ.. ఇప్పుడు నారా లోకేష్ పై ఫోకస్ మార్చిందా..? మంగళగిరి నియోజకవర్గం పై వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

ఇంకా చదవండి ...
    YCP Focus on Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార-ప్రతిపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం నెలకొంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలతో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. ఇప్పటికే కీలక నియోజకవర్గాలపై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మొన్నటి వరకు కుప్పం (Kuppam) పై పూర్తి పట్టుబిగించే దిశగా అడుగులు వేసిన అధికార పార్టీ.. ఇప్పుడు టార్గెట్ మార్చిందా..? లేక అదనంగా మరో కీలక నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తోందా..? అయితే తాజా పరిస్థితిని చూస్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా మారింది.

    సీఎం జగన్‌తోపాటు విపక్షనేత చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. అందుకే మంగళగిరిపై పట్టుకోసం రెండు పార్టీలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే 2019లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చెయ్యడంతో చాలా హైప్‌ వచ్చింది. ఆ ఎన్నికల్లో లోకేష్‌ ఓడిపోవడం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా గెలవడం పెద్ద చర్చకే దారితీసింది. దీంతో మొదట్లో లోకేష్.. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాన్ని మార్చేస్తారని ప్రచారం జరిగింది. కానీ లోకేష్ మాత్రం ప్రస్తుతం మంగళగిరి నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. అందుకే మంగళగిరిలో మరింత పట్టు బిగించేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి.

    ఇదీ చదవండి వైసీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు.. 23 నుంచి వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ.. అందరి చూపు ఆమెపైనే?

    మంగళగిరిలో సామాజిక సమీకరణలు చూస్తే.. పద్మశాలీ ఓటర్లు సుమారు 50 వేల వరకూ ఉన్నారు. ఈ సామాజిక వర్గం ఓటర్లు ఎటు మొగ్గు చూపితే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువ. గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఆర్కేకు మంగళగిరి టౌన్‌ మాత్రం మైనస్‌ అయ్యింది. రెండుసార్లూ ఆయనకు అక్కడ మెజారిటీ రాలేదు. తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో.. మంగళగిరి టౌన్‌లో ఎదురైన మైనస్‌ను అలా భర్తీ చేసుకుంటూ లెక్క సరి చేసుకున్నారు. అయితే ఈసారి వైసీపీ తన ప్లాన్ మార్చిందని టాక్‌. మంగళగిరిలో ఉన్న బీసీ నేతలందరినీ క్యాప్చర్ చెయ్యాలని మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం.



    పద్మశాలీ నేత చిల్లపల్లి మోహన్‌రావుకు ఆప్కో ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. అయితే టీడీపీకి రాజీనామా చేసినా..? వైసీపీలో చేరకముందే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది వైసీపీ. మంగళగిరి పట్టణ అధ్యక్ష పదవి కూడా చేనేత సామాజికవర్గానికి చెందిన మునగాల మల్లేశ్వరావుకు ఇచ్చారు. ఆయన భార్య భాగ్యలక్ష్మిని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి వరించింది. మంగళగిరి యార్డు చరిత్రలో ఇప్పటివరకూ చేనేతలకు ఛైర్మన్ పదవి ఇవ్వలేదు. మొదటిసారిగా ఆ పదవిని చేనేతలకు కట్టబెట్టి ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించే ఎత్తుగడ వేసింది.

    ఇదీ చదవండి : వైసీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు.. 23 నుంచి వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ.. అందరి చూపు ఆమెపైనే?

    అక్కడితోనే వైసీపీ ఆపరేషన్ ఆగలేదు. చేనేత సామాజికవర్గం ఓటర్లను పూర్తిస్థాయిలో తమవైపు తిప్పుకునేందుకు మరిన్ని పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు మంగళగిరిలో ప్రచారం జరుగుతుంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాండ్రు కమలకు కీలక పదవి ఇవ్వబోతున్నారట. తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు కమలను మేయర్‌ను చేస్తారని అనుకుంటున్నారు. కమల బరిలో ఉంటే గెలుపు ఈజీ అనే లెక్కలు వేస్తున్నారట. మురుగుడు హనుమంతరావుకు కాండ్రు కమల వియ్యపురాలు. హనుమంతరావు గతంలో మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాండ్రు కమల కూడా మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు.

    ఇదీ చదవండి: ‘క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర ’ ఉత్తరాంధ్రలో జోష్ పెంచిన చంద్రబాబు పర్యటన

    చేనేత సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు ఆ సామాజికవర్గంలో మంచి పట్టుంది. అందుకే ఇద్దరికీ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గం మొత్తం వైసీపీకి అండగా ఉంటుందనేది అధిష్టానం ఆలోచన. అంతేకాదు ఎన్నికల సమయానికి టీడీపీలో ఉన్న చేనేత సామాజికవర్గానికి చెందిన కీలక నేతను కూడా వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. మరి ఈ వ్యూహాన్ని లోకేష్ తిప్పి కొట్టగలరో లేదో చూడాలి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Mangalagiri, Nara Lokesh, TDP, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు