హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: రాజధాని జిల్లా అయినా అధికార పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందా..? కారణం ఇదే..?

AP Politics: రాజధాని జిల్లా అయినా అధికార పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందా..? కారణం ఇదే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ (File Photo)

ఏపీ సీఎం వైఎస్ జగన్ (File Photo)

CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యమంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. 175 ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారు. కానీ వాస్తవాలను పరిశీలిస్తే.. సీఎం జగన్ నివాసం ఉన్న.. రాజధాని జిల్లా అయిన గుంటూరులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.. కారణం ఏంటి..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  CM Jagna: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఎక్కడ మాట్లాడినా..  ఎన్నికల గురించి చెప్పినా.. తన లక్ష్యం 175కి 175 సాధించడమే అంటున్నారు. నేతలను, కార్యకర్తలు కూడా అదే లక్ష్యంతో పని చేయాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతం ఉమ్మడి గుంటూరు (Gunturu) లో పరిస్థితి ఏంటి... ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో మొత్తం 17 నియోజక వర్గాలకు గాను 15 స్థానాలను వైసీపీనే సొంతం చేసుకుంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)  గెలిచింది..  కేవలం రేపల్లె, గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గాలు మాత్రమే.. అయితే గుంటూరు పశ్ఛిమ శాసనసభ్యుడు మద్దాలి గిరిధర్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మొత్తం గా జిల్లాలో అధికార పార్టీ బలంగా ఉందనే చెప్పాలి.

  జిల్లా వైసీపీ నేతలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఇదంతా సాధ్యమైంది. కానీ  ఇటీవలి కాలంలో జిల్లా వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. చాలా నియోజకవర్గాలలో నాయకుల మధ్య  తారాస్థాయిలో విభేదాలు బయట పడుతున్నాయి. చాలా చోట్ల వర్గ పోరు పతాక స్థాయికి చేరుకుంది.. బహిరంగంగానే నేతలు విమర్శలు చేసుకుంటున్నారు.  

  చిలకలూరిపేటలో మంత్రి విడదల రజనికి  మర్రి రాజశేఖర్ మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ విబేధాలు ఇలాగే కొనసాగితే అక్కడ రజని గెలుపు కష్టమే అనే ప్రచారం ఉంది. ఇక మంగళగిరిలో  ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిపై  ఆ నియోజకవర్గం ద్వితీయ శ్రేణి నాయకులు  తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వినికిడి. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత .. మంత్రి పదవి కోల్పోయిన నాటి నుండే అధిష్టానం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

  ఇదీ చదవండి : వైసీపీకి కొత్త జిల్లాలు రాజకీయంగా కలిసి రాలేదా..? అసలు సమస్య ఏంటంటే?

  తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవిని పార్టీ అధిష్టానమే  పక్కన పెట్టిన ప్రచారం జరుగుతోంది. అక్కడ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ను ఇంచార్జ్ గా నియమించడంతో శ్రీదేవి వర్గం రగిలిపోతోంది. దీనికి తోడు బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ బాబు కూడా ఈ సారి తాడికొండ నుండి ఎమ్మెల్యేగా  పోటీచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారనే ప్రచారం ఉంది.

  ఇదీ చదవండి : కీలక నేతలకు షాక్.. చెవిరెడ్డికి ప్రమోషన్.. సీఎం జగన్ఎ న్నికల టీం ఇదే

  రేపల్లె నుంచి ఈ సారి మంత్రి అంబటి రాంబాబు పోటీలో ఉంటారనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అదే జరిగితే పార్టీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ మోపిదేవి  వెంకటరమణ నుండి అంబటికి పెద్దగా సహాయం అందకపోవచ్చని ప్రచారం ఉంది. ఇక పొన్నూరు శాసనసభ స్థానం నుండి పోటీచేయాలని ప్రస్తుత నరసరావు పేట ఎంపఅ లావు శ్రీ క్రిష్ణ దేవరాయలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. పొన్నూరు నుండి సీటు దక్కని పరిస్థితులలో ఆయన పార్టీ మారే అవకాశాలు సైతం లేకపోలేదని విశ్లేషకుల అంచనా.

  ఇదీ చదవండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్.. రెబల్ ఎంపీకి నోటీసులు.. ఎంత ఆఫర్ చేశారంటే..!

  మరో సీనియర్ నాయకుడు మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామ క్రిష్ణారెడ్డికి ఇంటిపోరు ఎక్కువైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి ఈ సారి ఎన్నికలలో పోటీకి పట్టుబడుతున్నారని టాక్. ఒక వేళ వైసీపీ  నుండి సీటు దక్కని నేపధ్యంలో ఆయన పార్టీ మారవచ్చనే ప్రచారం కూడా ఉంది. వినుకొండ నియోజకవర్గంలో  ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లి ఖార్జున వర్గాల మధ్య సయోధ్య కుదరడంలేదు. మరో నియోజకవర్గం గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ జంగ క్రిష్ణమూర్తి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics