ఏపీలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు వైసీపీ (Ysrcp) నాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) భావించారు. ఇందుకోసం కసరత్తు చేసిన ఆ పార్టీ నాయకత్వం.. నేడు అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రకటన చేసింది. మొత్తం 18 స్థానాల్లో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీ 1, ఓసీలకు 4 స్థానాలు కేటాయించింది. మొత్తం ఖాళీల్లో ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక సంస్థల కోటాలో 9 మంది, గవర్నర్ కోటాలో 2 రెండు ఖాళీలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో నర్తు రామారావు(శ్రీకాకుళం)( బీసీ-యాదవ), కూడుకూడి సూర్యనారాయణ(తూర్పు గోదావరి)( బీసీ-శెట్టి బలిజ), వంకా రవీంద్ర (పశ్చిమ గోదావరి) (కాపు), కవురు శ్రీనివాస్ (పశ్చిమ గోదావరి (బీసీ-శెట్టి బలిజ), మేరుగు మురళీధర్(నెల్లూరు) (ఎస్సీ-మాల), సిపాయిల సుబ్రమణ్యం(చిత్తూరు) (బీసీ), పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (ఓసీ), మధుసూదన్(కర్నూలు) (వాల్మీకి బోయ-బీసీ), మంగమ్మ(అనంతపురం) (బీసీ-వాల్మీకి బోయ).
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పెన్మత్స సూర్యనారాయణ రాజు (ఓసీ), పోతుల సునీత (బీసీ), కోలా గురువులు (బీసీ), బొమ్మి ఇజ్రాయిల్( ఎస్సీ), జయమంగళ వెంకటరమణ (బీసీ), చంద్రగిరి ఏసురత్నం (బీసీ), మర్రి రాజశేఖర్ (ఓసీ), గవర్నర్ కోటాలో కుమ్మా రవిబాబు (ఎస్టీ), కర్రె పద్మశ్రీ(బీసీ) ఉన్నారు.
అభ్యర్థులను ప్రకటించడానికి ముందు ఆ పార్టీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో సామాజిక న్యాయం పాటించలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మండలిలో 37 శాతమే ప్రాతినిధ్యం ఉందని గుర్తు చేశారు.
Ysrcp MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ .. వీరికే ఛాన్స్
YS Bharathi: రాజకీయాల్లోకి సీఎం జగన్ సతీమణి.. వైఎస్ భారతి పోటీ చేసేది ఇక్కడి నుంచేనా..?
తాజాగా వైసీపీ ప్రకటించిన అభ్యర్థులను కలుపుకుంటే శాసనమండలిలో వైసీపీ బీసీ ఎమ్మెల్సీల సంఖ్య 19కి పెరుగుతుంది. వైసీపీ ఓసీ ఎమ్మెల్సీల సంఖ్య 14కు చేరుతుంది. మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని సజ్జల చెప్పారు. ఈ విషయంలో సామాజిక సాధికారిక అంటే తమదే అని వివరించారు. బీసీలుకు పదవులు ఇచ్చే విషయంలో చంద్రబాబు మాటలు చెబితే.. తాము చేతల్లో చేసి చూపించామని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp