హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వేటు.. సీఎం జగన్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన ?

YS Jagan: సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వేటు.. సీఎం జగన్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన ?

సీఎం జగన్(File image)

సీఎం జగన్(File image)

Anam Ramanarayana Reddy: ఇప్పటికే వెంకటగిరి వైసీపీ ఇంఛార్జ్‌గా మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డిని నియమించిన వైసీపీ నాయకత్వం.. ఆనం రామనారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందనే ప్రచారం సాగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కొంతకాలం నుంచి ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వెంకటగిరి (Venkatagiri) ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై(Anam Ramanarayana Reddy) పార్టీ పరంగా చర్యలు తీసుకునేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఆనం ఈ రకమైన వ్యాఖ్యలు చేసినా.. ఇటీవల కాలంలో మరింత తీవ్రంగా తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, అది ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగించేలా ఉందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. దీంతో అతి త్వరలోనే ఆయనపై పార్టీపరంగా వేటు వేసే దిశగా వైసీపీ నాయకత్వం ప్రకటన చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెంకటగిరి వైసీపీ ఇంఛార్జ్‌గా మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డిని(Anam Ramkumar Reddy) నియమించిన వైసీపీ నాయకత్వం.. ఆనం రామనారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందనే ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏడాదిలోపు ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడంలేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. అధికారులను అడిగితే త్వరలో పూర్తి చేస్తామని చెబుతున్నారని.. అవి పూర్తి అయ్యే లోపు తమ పదవి కాలం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చుని పని చేయాలో అర్థం కావడం లేదన్నారు.

కొద్దిరోజుల క్రితం కూడా ఆనం రామనారాయణరెడ్డి ఇదే రకంగా అసంతృప్తి గళం వినిపించారు. ఏం పనులు చేశామని ప్రజలకు వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి ? అని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేనో కాదో అనే అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. లేకపోతే వెంకటగిరి అభ్యర్థిగా కొత్తవారిని ఎవరినైనా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిందా? అని ప్రశ్నించారు. కార్యకర్తల్లో కూడా ఇదే సందేహం ఉందని తెలిపారు. నియోజకవర్గంలో సమన్వయ లోపం ఉందని అన్నారు.

Pawan Kalyan: 'సీఎం పవన్ కళ్యాణ్' పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తా..పవన్ కు మంత్రి ఆఫర్

Ap: సీఎం జగన్ సభలో అపశృతి..వృద్ధురాలికి తీవ్ర గాయాలు

ఐదేళ్ల ప్రాతిపదికన వెంకటగిరి ప్రజలు తనకు ఓటేస్తే గెలిచానని, మరో సంవత్సరం పాటు తానే ఎమ్మెల్యేనని, కానీ ఓ పెద్దమనిషి అప్పుడే తాను ఎమ్మెల్యే అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. ఆ వ్యక్తి గతంలోనూ తానే ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రచారం చేసుకుని సగంలోనే పారిపోయారని ఎద్దేవా చేశారు.

First published:

Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు