ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికార పార్టీ వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary-2022) సమావేశాలకు సిద్ధమవుతోంది. గంటూరు (Guntur) లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్లీనరీకి సంబంధించిన కీలక అంశాలను వెల్లడించారు. ప్లీనరీ సమావేశాలను పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి వివరించారు. సీనియర్ నేతలందరూ ప్లీనరీ నిర్వహణలో భాగస్వాములై పనిచేయాలని కోరారు. ఆయా కమిటీలకు సంబంధించి సభ్యులతో సమావేశమై వారి భాగస్వామ్యంతో వారికి అప్పగించిన బాధ్యతలను చూడాలని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గ,జిల్లా స్దాయి ప్లీనరీలు కార్యకర్తల ఉత్సాహాల మధ్య విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలియచేశారు. ఇదే ఉత్సాహాన్ని ప్లీనరీ సమావేశాలలో కూడా చూపించాలన్నారు.
సీఎం జగన్ అధికారం చేపట్టాక జరుగుతున్న ప్లీనరీ సమావేశం కాబట్టి ఇవి ఎంత విజయవంతంగా జరిగితే పార్టీకి, ప్రభుత్వానికి అంత మంచిపేరు వస్తుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇప్పటికే ఎన్నో పధకాలు ప్రజలకు మేలు చేసేలా అమలు చేస్తున్నామని.,. రాబోయే రెండేళ్ల కాలంలో మరింత మెరుగ్గా పనిచేసి ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేయాలన్నారు. గ్రామస్ధాయి నుంచి జడ్పి ఛైర్మన్ల వరకు, ఎంపిటిసి, జడ్పిటిసిలు, వార్డు మెంబర్ స్ధాయి నుంచి సర్పంచ్ స్ధాయి వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు.
రాష్ర్టంలోని స్దానికసంస్ధలనుంచి పార్లమెంట్ సభ్యుల వరకు దాదాపు 80 శాతం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్ధితులలో జరుగుతున్న ప్లీనరీకి ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు..ఐదేళ్ల తర్వాత జరుగుతున్న పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ గర్వపడేలా రీతిలో నిర్వహించుకోవాలన్నారు. కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యతను ఆయా కమిటీల కన్వీనర్లు తీసుకోవాలన్నారు. వసతి,బోజనం,రవాణా వంటివాటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇక పార్టీ ప్లీనరీలో వివిధ అంశాలను సమీక్షించడం, తీర్మానాలు, అజెండా ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించేందుకు ఎక్సర్ సైజ్ జరుగుతోందన్నారు.
ప్లీనరీ నిర్వహణ కమిటీ కన్వీనర్,రాష్ర్ట విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ మాట్లాడుతూ 2017లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నసమయంలో ప్లీనరీ సమావేశాలు జరుపుకున్నామని.. . ఆనాటి ప్లీనరీ సమావేశాలకు నేటి సమావేశాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. ప్రజల అంచనాలు అధికంగా ఉంటాయని.., తమ అభివృధ్దికి,రాష్ర్ట అభివృధ్దికి ప్లీనరీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తుంటారని బొత్స చెప్పారు. ఎంతో భాద్యతగా అంకితభావంతో పనిచేసి ప్లీనరీ సమావేశాలను నిర్వహించుకుంటే బాగుంటుందన్నారు. ఇక వైసీపీ ప్లీనరీ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చస్తున్నట్లు పార్టీ ముఖ్యనేతలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Ysrcp