అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత వెలసిన దివ్యక్షేత్రం తిరుపతి. స్వామి వారి ఆశీస్సులతో చిన్న టౌన్ కాస్త ఇప్పుడు మహా నగరంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో తొలిసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుపుతుంది. తిరుపతి మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2002 వరకు మున్సిపాలిటీగా ఉన్న తిరుపతి.. ఆ తర్వాత కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. తిరుపతికి చివరి మున్సిపల్ ఛైర్మన్ గా కందారపు శంకర్ రెడ్డి రికార్డ్ నెలకొలిపితే.... 2007 లో కార్పొరేషన్ అయినా తిరుపతి మున్సిపాలిటీ వేర్వేరు కారణాలవల్ల 2021 వరకు ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. 2002వ సంవత్సరంలో ఆఖరిగా తిరుపతి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తిరుపతి మున్సిపాలిటీని మునిసిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళమని వివిధ కారణాలను చూపుతూ... కొన్ని గ్రామాలు కోర్టు మెట్లు ఎక్కాయి దీంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరుపతిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మొదటి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న....అధికార వైసీపీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఎన్నికలు జరిగిన 49 డివిజన్లలో వైసీపీ ఘన విజయం సాధించగా.. ప్రతిపక్ష పార్టీ మాత్రం కేవలం ఒకే ఒక్క డివిజన్ కు పరిమితం అయింది.
ఎన్నికలు ముగిశాయి.., అధికార పార్టీ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడంతో ఇప్పుడు అందరి చూపు మేయర్ అభ్యర్థి పైనే పడింది. అసలే 20 ఏళ్ళ అనంతరం జరిగిన ఎన్నికలు కావడం., మొదటి మేయర్ అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు కూడా తెరపడింది. 27వ డివిజన్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ శిరీష ను మేయర్ పీఠం వరించనుంది. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మొదటి మేయర్ గా డాక్టర్ శిరీష తిరుపతికి సేవలందించనున్నారు. ఈ నెల 18వ తేదీన మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. 48 స్థానాలు వైసీపీ పార్టీ కైవసం చేసుకోవడంతో లాంఛనంగానే డాక్టర్ శిరీష మేయర్ గా బాధ్యతులు స్వీకరించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap local body elections, Municipal Elections, Tirupati