హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసిందా..? విచారణ ఈ నెల 22కు వాయిదా..?

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసిందా..? విచారణ ఈ నెల 22కు వాయిదా..?

వైఎస్ వివేకా (ఫైల్)

వైఎస్ వివేకా (ఫైల్)

Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వివేక హత్య కేసు.. డైలీ సీరియస్ లా సాగుతోంది. కానీ కేసుకు మాత్రం ముగింపు పడడం లేదు. తాజా పరిణామాలు చూస్తే.. ఈ కేసులో సీబీఐ చేతులెత్తేసిందే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Viveka Murder Case:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Murder Case) లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసులో లో ప్రతి అంశం సంచలనం సృష్టిస్తోంది.  తాజాగా ఈ హత్య కేసులో విచారణకు పిలిస్తే... దర్యాప్తు అధికారి, సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారని సీబీఐ తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌ హైకోర్టుకు వెల్లడించారు. పులివెందులకు చెందిన వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా యాడికి వాసి గంగాధర్‌రెడ్డిలు... సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై దిగువ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు వేశారన్నారు.

  పరిస్థితి ఇలాగే కొనసాగితే వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగదన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. దీంతో హైకోర్టు (High Court) న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.

  మూడేళ్ల క్రితం పెను సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కూడా సంచలనాలు రేపుతోంది. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో దీన్ని బయటపెడుతున్న సీబీఐ అధికారులపై కూడా కేసుల పరంపర మొదలైంది. అయితే ఈ కేసు దర్యాప్తులో కీలకంగా ఉన్న సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ ను టార్గెట్ చేస్తూ ప్రైవేటు కేసులు దాఖలవుతున్నాయి. దీనిపై తాజాగా హైకోర్టులో ఈ కీలక పరిణామం జరిగింది.

  ఇదీ చదవండి : కుప్పంలో కాల్పుల కలకలం.. పాఠశాలలో భయం భయం.. ఏం జరిగిందంటే?

  ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కనిపెట్టిన అంశాల ఆధారంగా దర్యాప్తు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఆటంకాలు తప్పడం లేదు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీబీఐ కూడా ఈ వ్యవహారంలో ముందుకు సాగలేని పరిస్ధితులు తలెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా సీబీఐ నిందితులుగా గుర్తించిన వారిలో కొందరిని రిమాండ్ కు పంపింది. మరికొందరి వాంగ్మూలాలు తీసుకుని వదిలిపెట్టింది. వీరిలో కొందరు విచారణకు హాజరుకమ్మని సీబీఐ కోరితే హాజరుకాకుండా సీబీఐపైనే ప్రైవేటు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మరో ట్విస్ట్ గా మారుతోంది.

  ఇదీ చదవండి : మళ్లీ భయపెడుతున్న గోదావరి.. భారీ వానలతో పెరుగుతున్న వరద.. ప్రమాదకరంగా ప్రవాహం

  వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను సీబీఐ ఏఎస్పీ బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌/ స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్‌ కోర్టు దాన్ని ఠాణాకు రిఫర్‌ చేసింది. రిమ్స్‌ ఠాణా పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఐపీసీ సెక్షన్‌ 195ఏ, 323, 506, రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టేయాలని రామ్‌సింగ్‌ హైకోర్టును ఆశ్రయించగా... ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపేస్తూ ఫిబ్రవరిలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సోమవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది.తీర్పు దస్త్రాల అదృశ్యంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులు చేస్తే.. ఈ కేసులు అధికారులు చేతులెత్తేశారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Crime news, Ys viveka murder case

  ఉత్తమ కథలు