YS Family Politics: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) హైదరాబాద్ (Hyderabad)లో వైఎస్‌ఆర్ సంస్మరణ సభ హీటు పుట్టిస్తోంది. వైఎస్ విజయమమ్మ ఆహ్వానాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వర్దంతి సందర్భంగా.. ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు, సన్నిహితంగా ఉండే నేతలు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్ లు, టాలీవుడ్ పెద్దలకు ఆహ్వానాలు పంపినట్టు సమాచారం. ఈ సంస్మరణ సభ ప్లాన్ చేసింది.. ఎవర ఎవరికి ఆహ్వానాలు అందించాలి అన్నది అంతా ప్రశాంత్ కిషర్ వ్యూహంలో భాగమని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ఓ వైపు హుజురాబాద్ ఉపఎన్నిక (Huzrurabad By poll). ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth ReddY) వరస బహిరంగసభలు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర. ఇదే టైమ్‌లో 12 ఏళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ సహచరులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు వైఎస్ విజయమ్మ. రేపు వైఎస్ వర్ధంతి సందర్భంగా హైటెక్స్‌లో ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.
ఈ సమావేశానికి నాటి కేబినెట్ మంత్రులే కాకుండా.. ఉమ్మడి ఏపీలో స్పీకర్‌గా పనిచేసిన సురేష్ రెడ్డి (Suresh Reddy) , పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌తో పాటు మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao), ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar)లు ఈ లిస్ట్‌లో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి (Chakrapani) నేతృత్వం వహిస్తున్నట్టు సమాచారం. ఏపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyannarayana) వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రిటైర్డ్ ఐపీఎస్‌లు.. ఐఏఎస్‌లకు ఆహ్వానాలు వెళ్లాయట. సినీవర్గం నుంచి హీరో నాగార్జున (Nagarjuna)తోపాటు డైరెక్టర్లు పూరీ జగన్నాథ్ (Puri Jagannath), వీవీ వినాయక్ (VV Vinayak)ల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టిన YSR తెలంగాణ పార్టీ వెళ్లూనుకోవడానికి చూస్తోంది. ఇదే సమయంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. దీంతో విజయమ్మ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. వైఎస్‌తో కలిసి కాంగ్రెస్‌లో పనిచేసిన వారు ఇప్పుడు వేర్వేరు పార్టీలలో ఉన్నారు. ఎలాంటి సంకేతాలు ఇస్తుంది. కేవలం వైఎస్ సన్నిహితుల ఆత్మీయ సమ్మేళనానికే సమావేశం పరిమితం అవుతుందా? లేక ఇతరత్రా రాజకీయ చర్చకు వేదిక అవుతుందా అన్నది చూడాలి.
ఈ సమావేశం ప్రశాంత్ కిశోర్ సూచనలతోనే జరుగుతున్నట్టు సమాచారం. పీకే బృందంలోని శిష్యురాలు ఒకరు ప్రస్తుతం షర్మిల పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఒకవేళ పీకే సూచనల మేరకే సెప్టెంబర్ రెండు భేటీ ఏర్పాటు చేసి ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి. అందుకే అందరి దృష్టీ రేపటి ఆత్మీయ సమ్మేళనంపై ఉంది. ఆహ్వానితుల జాబితాలో కొందరు తాము రాలేమని చెప్పేశారట. తమ సహకారం ఉంటుందని చెప్పారట. ఆ సహకారం ఏంటన్నది చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Botsa satyanarayana, YS Sharmila, YS Vijayamma