హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Vijayamma: జగన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన విజయమ్మ..! పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..

YS Vijayamma: జగన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన విజయమ్మ..! పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..

చాలా రోజుల  తరువాత జగన్ తో కలిసి కనిపించిన విజయమ్మ సంచలన నిర్ణయం ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి తాను తప్పుకుంటున్నానని.. పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆమె ప్రస్తావిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన అన్నకు ఎలాంటి కష్టం, ఇబ్బంది కలగకూడదనే షర్మిల తెలంగాణ కోడలిగా అక్కడ పార్టీ పెట్టుకున్నారన్నారు విజయమ్మ.

చాలా రోజుల తరువాత జగన్ తో కలిసి కనిపించిన విజయమ్మ సంచలన నిర్ణయం ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి తాను తప్పుకుంటున్నానని.. పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆమె ప్రస్తావిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన అన్నకు ఎలాంటి కష్టం, ఇబ్బంది కలగకూడదనే షర్మిల తెలంగాణ కోడలిగా అక్కడ పార్టీ పెట్టుకున్నారన్నారు విజయమ్మ.

వైసీపీ ప్లీనరీ (YCP Plenary-2022) వేదికగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా (YS Vijayamma Resignes) చేసిన సంగతి తెలిసిందే. ఐతే తన ప్రసంగంలో భాగంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ప్లీనరీ (YCP Plenary-2022) వేదికగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా (YS Vijayamma Resignes) చేసిన సంగతి తెలిసిందే. ఐతే తన ప్రసంగంలో భాగంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ ను ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె జగన్ చిన్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర ఘటనను గుర్తు చేశుకున్నారు. "జగన్ స్కూల్లో చదువుకునే సమయంలో వైఎస్ఆర్ ఇంట్లో ఉండేవారు కాదు.. కుటుంబంతో గడిపే సమయం కూడా ఉండేది కాదు.. ఆ సమయంలో జగన్ తో తాను ఓ మాట చెప్పానని.. మనకు రాజకీయాలు వద్దని.. ఓ నాలుగు పరిశ్రమలు పెట్టి దర్జాగా కాలుమీద కాలేసుకొని ఉందామని చెప్తే.. జగన్ మాత్రం తన తండ్రి దారిలోనే నడుస్తానని" చెప్పినట్లు విజయమ్మ గుర్తుచేశారు.

ఈ రోజు జగన్ సాధించిన ఘనతను చూసి గర్వపడుతున్నట్లు విజయమ్మ తెలిపారు. జగన్ తన మనసుతో రాష్ట్రాన్ని పాలిస్తున్నాడన్నారామె. వైఎస్ఆర్ తన పాలనతో వరల్డ్ రికార్డ్ సృష్టించారాన్నారు. జగన్ అధికారంలోకి రావడానికి ఎన్నో కష్టాలుపడ్డారని.. అవమానాలు ఎదుర్కొన్నారన్నారు. వైఎస్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. తన సొంత మార్క్ పాలనతో ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని విజయమ్మ చెప్పారు.

ఇది చదవండి: వైసీపీకి విజయమ్మ రాజీనామా.. ప్లీనరీలో సంచలన ప్రకటన


రాష్ట్రంలో ప్రతి పేద తండ్రయినా, పేద తల్లి అయినా మీ బిడ్డ భవిష్యత్తును జగన్ చేతిలో పెడితే వారి భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోతుందన్నారు. తరాల తలరాతను మార్చే విద్యావిధానాన్ని జగన్ తీసుకొచ్చారని ఆమె అన్నారు. రైతులకు అసరాగా ఉండేందుకు, మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు జగన్ కృషి చేస్తున్నాడన్నారు.

ఇది చదవండి: వేటాడే పులి.., జగనన్న వన్స్ మోర్.. ప్లీనరీలో రోజా డైలాగ్స్ అదుర్స్


రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు ఏం అభివృద్ది చేశారని విమర్శించారు. వాళ్లంతా ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలన్నారు. విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ను గత ప్రభుత్వం కట్టలేకపోయిందని.. జగన్ వచ్చిన వెంటనే పూర్తి చేశారన్నారు. వైఎస్ కూడా హైదరాబాద్ లో 14 ఫ్లై ఓవర్లు నిర్మించారని విజయమ్మ గుర్తుచేశారు. మరోసారి తన బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నానని ఆమె అన్నారు.


ఇది చదవండి: రాష్ట్రంలో రాక్షసులు బయలుదేరారు..! ప్లీనరీలో జగన్ సంచలన కామెంట్స్..

ప్రజలతో తమది 45 ఏళ్ల అనుబంధముందని.. ఏ విషయంలోనైనా సమాధానం చెప్పాలంటే అది ప్రజలకేనన్నారు. ఇన్నేళ్లు వైఎస్ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న పులివెందుల, కడప ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని విజయమ్మ అన్నారు. కడప ప్రజలు రాజశేఖర్ రెడ్డిని నాయకుడ్ని చేస్తే.. ఉమ్మడి రాష్ట్రం ఆయన్ను మహానేతగా నిలబెట్టిందన్నారు. వైఎస్ఆర్ మనల్ని వదిలి వెళ్లిన పోయిన తర్వాత.. ఏ పార్టీకైతే సేవచేశామో ఆ పార్టీ తమను రోడ్డున వదిలేశారన్నారు. ఆ సమయంలో తమను ఆదరించి అక్కున చేర్చుకుంది ప్రజలేనని విజయమ్మ అన్నారు. అంతేకాదు జగన్ ను ఏ కారణం లేకుండానే జైలులో పెట్టారని చెప్పారు. జగన్ తో కలిసి నిలబడిన ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం తాను షర్మిల యాత్ర చేపట్టామన్నారు. షర్మిల పాదయాత్ర రోజు చాలా బాధేసిందని విజయమ్మ అన్నారు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర చేసిన సమయంలోనూ ప్రజలు ఆశీర్వదించారన్నారు. అందుకే జగన్ కు 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లిచ్చారన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, YS Vijayamma, Ysrcp

ఉత్తమ కథలు