హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Vijayamma: విజయమ్మ రాజీనామా వైసీపీకీ నష్టమేనా..? పార్టీలో ఆమె పోషించిన పాత్ర ఇదే

YS Vijayamma: విజయమ్మ రాజీనామా వైసీపీకీ నష్టమేనా..? పార్టీలో ఆమె పోషించిన పాత్ర ఇదే

వైఎస్ విజయమ్మ రాజీనామతో పార్టీకి నష్టమేనా?

వైఎస్ విజయమ్మ రాజీనామతో పార్టీకి నష్టమేనా?

YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి నష్టం తప్పదా..? సీఎం జగన్ తల్లి.. వైఎస్ విజయ్మ రాజీనామా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? ఇప్పటి వరకు ఆమె పార్టీలో పోషించిన పాత్ర ఏంటి..?

M BalaKrishna, Hyderabad, News18

YS Vijayaamm: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP) కి పెద్ద షాక్ తగిలింది. అధినేత జగన్ తల్లి విజయమ్మ.. పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు  ప్లినరీ  వేదికగా ప్రకటన చేశారు. చాలా రోజుల నుంచి దీనిపై ఊహాగానాలు వస్తున్నా.. అలాంటి ఏదీ లేదని నిన్నటి వరకు వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఆమె రాజీనామా వార్తలపై చర్చే జరగలేదని కీలక నేతలు సైతం చెప్పారు.. కానీ అనూహ్యంగా నేడు వైఎస్ విజయమ్మ (YS Vijayamma) సంచలన ప్రకటన చేశారు. ఆమె తప్పుకోడానికి కారణం ఏదైనా.. జగన్ పై పూర్తి ప్రేమ ఉన్నా.. ఆమె రాజీనామా మాత్రం పార్టీ పై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. బయటకు చెప్పే కారణం ఏదైనా.. ఆమె తీవ్ర సంఘర్షణకు లోనయ్యే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ బంధు వర్గంలో మాత్రం ఈ ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే వైఎస్ విజయమ్మ రాజకీయ ప్రస్థానం ఈజీగా ప్రారంభం కాలేదు. ముళ్లబాటతో మొదలైంది. దివంగత నేత డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత  పులివెందుల ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచి.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైఎస్ మరణం తరువాత..  కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆ వివాదంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు విజయమ్మ. 

ఆ రోజు నుంచి తనయుడు జగన్ మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ.... కొత్త పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తూ వచ్చారు. 2011 మర్చి 12వ తేదీ వైసీపీ పార్టీని ప్రకటించారు... అప్పటి నుంచి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతూ వచ్చారు. పార్టీ పెట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానంద రెడ్డి పై భారీ మెజారిటీతో విజయమ్మ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో 81,373 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఇదీ చదవండి : కోడి పందాలంటే చిన్నప్పటి నుంచి వ్యసనం.. మాట మార్చిన టీడీపీ నేత

మొదటి సారి ఎన్నికైన నాటి నుంచి రాజీనామా చేసే వరకు అసెంబ్లీకి రాలేదు. కేవలం. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో విజయమ్మ అసెంబ్లీకి హాజరయ్యారు. అనంతరం 2013లో సమైక్యాంద్ర ఉద్యమం కోసం రాజీనామా చేసి సమాఖ్య వాదులకు స్ఫూర్తిగా నిలిచారు. విభజనను నిరసిస్తూ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆమరణ నిరాహార దీక్ష భగ్నం చేసి... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర విభజన ఆపాలన్న లేఖలను సైతం కాంగ్రెస్ పార్టీ నేతలకు రాసారు. 

ఇదీ చదవండి : తండ్రి జయంతి రోజే.. అమ్మ రాజీనామా.. విజయమ్మ నిర్ణయానికి అదే కారణమా..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మనీ ల్యాండరింగ్ కేసులో సిబిఐ., ఈడీ అర్ధరాత్రి అరెస్టులు చేసారు. అదే సమయంలో జగన్ కోసం దిల్ కుష్ అథిధి గృహం వద్ద విజయమ్మ బైఠాయించి తన కుమారుడి రాక కోసం నిరీక్షించారు. మే 2012లో వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యాక పార్టీ బలోపేత బాధ్యతలను..  విజయమ్మ,  షర్మిల తమ భుజాలపై వేసుకొని నడిపించారు. షర్మిల పాదయాత్ర చేస్తే... విజయమ్మ బస్సు యాత్ర చేసి వైసీపీ పార్టీని బలంగా మార్చారు.

ఇదీ చదవండి : పొత్తులతో సంబంధం లేకుండా టీడీపీ తొలి ఎంపీ అభ్యర్థి ఫిక్స్.. బహిరంగంగానే ప్రకటించిన చంద్రబాబు

ప్రజల్లో సానుభూతి.. నమ్మకంకలిగేలా జగనన్న వదిన బాణం... బిడ్డకోసం తల్లి తాపత్రేయం చూసి ప్రజలు వైసీపీ పార్టీ వైపు మళ్లారు. 2014 ఎన్నికల్లో తనదైన పాత్ర పోషించారు విజయమ్మ. కానీ స్వల్ప సీట్ల తేడాతో వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైంది. ఆమె సైతం విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీపడ్డారు.. కానీ ఓటమి తప్పలేదు. ఇక 2019 ఎన్నికల్లో గెలుపుకోసం విజయమ్మ ప్రత్యేక వ్యూహాలు రచించారు. అనుకున్న విధంగా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడాది వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న విజయమ్మ ఆ తరువాత మెల్లగా దూరం అవుతూ వచ్చారు. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తూ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, YS Sharmila, YS Vijayamma

ఉత్తమ కథలు