YS Sharmila: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekanand Reddy) హత్య కేసు (Murder Case) ఇంకా పూర్తి కొలిక్కి రాలేదు. సుదీర్ఘంగా విచారణ సాగుతూనే ఉంది.. అయితే ఈ కేసు విచారణలో భాగంగా కీలక పరిణమాలు చోటు చేసుకున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) కి సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని కోరింది. ఆయన దీనికి సమాధానం ఇచ్చారు. ముందుకు అనుకున్న షెడ్యూల్ కారణంగా నేటి విచారణకు హాజరు కాలేనని.. మరో ఐదు రోజుల సమయం ఇస్తే.. తప్పకుండా విచారణకు సహకరిస్తానని లేఖ రాశారు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు.
వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఆలస్యంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా విచారణ ఆలస్యమైతే.. ప్రజలకు సీబీఐపై నమ్మకం ఉంటుందా అని అన్నారు. ఇప్పటికైనా కేసులో నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. దోషులను పట్టుకుని శిక్షించాలన్నారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. వైసీపీ పార్టీకి చెందిన కండప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు అందిన సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం హైలైట్ అవుతున్నాయి. దోషులు అంటూ పరోక్షంగా వైసీపీ నేతల గురించి చెప్పారా అనే చర్చ కూడా జరుగుతోంది.
ఇదీ చదవండి : అందుకే అంత ఫాలోయింగ్.. పవన్ మూడు పెళ్లిళ్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఫైళ్లు హైదరబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యాయి. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరబాద్ సీబీఐ కోర్టుకు ఫైల్స్ చేరాయి. వివేక హత్య కేసుకు సంబంధించి మూడు బాక్సుల్లో చార్జిషీట్లు, సాక్షుల వాంగ్ములం, ఫైల్స్ తరలించబడ్డాయి. కాగా వివేకా హత్యకు సంబంధించి కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు ఉన్నాయి. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫైల్స్ తో పాటు ఇతర సంబంధిత వాంగ్ములాలతో పాటు అన్ని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేయబడ్డాయి.
ఇదీ చదవండి : అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా..? అదనపు భద్రత కోరిన సీీబీఐ
ఎందుకంటే విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు ఫైళ్లు, చార్జిషీటు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక డాక్యుమెంట్లు నేడు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు చేరుకున్నాయి. వీటిని ఇవాళ కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ తరలించారు. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పుడవన్నీ బదిలీ అయిన క్రమంలో హైదరాబాదులోని సీబీఐ న్యాయస్థానం త్వరలోనే వివేకా హత్య కేసు విచారణను ప్రారంభించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, YS Avinash Reddy, YS Sharmila, Ys viveka murder case