హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Sharmila: జగన్ కు స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా..? వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila: జగన్ కు స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా..? వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం వివాదం ముదురుతోంది. ఇటీవల తెలంగాణలో వరదలకు పోలవరం ప్రాజెక్టే కారణమని తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు.. దీనిపై అదే స్థాయిలో ఏపీ మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. తాజాగా ఈ వివాదంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.. జగన్ కు స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

  YS Sharmila: మొన్నటి వరకు సఖ్యంగానే కనిపించిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ప్రభుత్వాల మధ్య సరికొత్త వివాదం మొదలైంది. అది చిలికి చిలికి గాలివానగా మారింది. భద్రాచలానికి వరద ముప్పుకు కారణం ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)  కారణమని టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Government) ఇటీవల విమర్శలు చేసింది.. టీఆర్ఎస్ (TRS) విమర్శలకు ధీటుగానే వైసీపీ నేతలు (YCP Leaders) ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. అయినా వివాదం ఆగడం లేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందే అంటూ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ విషయంపై తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ అధినేతి వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. భద్రాచలం వరదలో ముంపుకు కారణం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవటమే కారణం అని భద్రాచలం గోదావరి కరకట్ట ఎత్తు పెంచకపోవటమే కారణం అంటూ షర్మిల ఆరోపించారు. వెంటనే గోదావరి కరకట్ట ఎత్తు పెంచాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు..తెలంగాణలో పార్టీ పెట్టిన ఇన్నాళ్లలో తన అన్న జగన్ గురించి ఒక్క మాటకూడా మాట్లాడని షర్మిల.. తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి జగన్ కు మధ్య ఉన్న సమన్వయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  గతంలో పోలవరం ప్రాజెక్టును మెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు పోలవరం గురించి విమర్శలు చేయటం ఏంటీ అంటూ ప్రశ్నించారు. భద్రాచలం ముంపుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణమైతే ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదు అని..పక్క రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ని స్వయంగా ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు.. మీకు ఈ విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం మునిగిపోతుందని అప్పుడు తెలియదా? అంటూ షర్మిల నిలదీశారు.

  తెలంగాణ ప్రభుత్వం ముందుగా అలర్ట్ అయ్యింది.. భద్రాచలం ముంపుని నియంత్రించటానికి..తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని విమర్శించారు. ప్రజలకు సహాయం చేయటానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలవరం ప్రాజెక్టును బూచిగా చూపించి టీఆర్ఎస్ ప్రభుత్వం సాకులు చెబుతోంది అంటూ ఆమ మండిపడ్డారు. వరద బాధితులకు ఒక్కరూపాయి సహాయం చేయకుండా వారిని ఆదుకోకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

  ఇదీ చదవండి : ఈ ఎమ్మెల్యేను గుర్తు పట్టారా..? అధికార పార్టీ నేత అయినా.. వ్యవసాయంతో బిజీ బిజీ

  సాధారణంగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన తరువాత ఒక్కసారి మినహా జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఇప్పుడు తొలిసారి ఏపీ-తెలంగాణ మధ్య వివాదం తలెత్తడంతో.. ఆమె తన అన్నయ్య విషయం ప్రస్తావించాల్సి వచ్చింది. ఓ రకంగా సీఎం కేసీఆర్ తోపాటు.. జగన్ ను కూడా ఆమె విమర్శించినట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, CM KCR, Polavaram, YS Sharmila

  ఉత్తమ కథలు