హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Sharimala: సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు.. అన్న కోసం ఏం చేశానో క్లారిటీ ఇచ్చిన షర్మిల

YS Sharimala: సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు.. అన్న కోసం ఏం చేశానో క్లారిటీ ఇచ్చిన షర్మిల

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: వైఎస్ షర్మిల అన్నపై డైరెక్ట్ ఎటాక్ కు దిగారా..? తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం..? ప్రస్తుతం షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆమె ఎమన్నారంటే?

 • News18 Telugu
 • Last Updated :
 • Delhi, India

  YS Sharimala: వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తన అన్న.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పై డైరెక్ట్ అటాక్ దిగారా..? తెలంగాణ (Telangana)లో పార్టీ పెట్టక ముందు నుంచే ఆమె అన్నయ్యకు దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా..? ఇటు జగన్ కానీ.. అటు షర్మిల కానీ ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేయలేదు. కాకపోతే అప్పుడప్పుడు షర్మిల పరోక్షంగా అన్నపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇంతకాలం అన్నపై పరోక్షంగా సెటైర్లు వేసిన ఆమె.. ఇప్పుడు నేరుగా అటాక్ కు దిగారా..? తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలకు అర్థం అదేనా..? తాను తన అన్నకు చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశానని పేర్కొన్నారు. తన శక్తికి మించి అన్నకు సాయం చేశానని తెలిపారు. అమె అక్కడితోనే ఆగలేదు. ఇంకా ఏమన్నారంటే?

  శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఆమె.. తెలంగాణ లో ప్రాజెక్ట్ ల పేరుతో జరిగిన అవినీతి పై సీబీఐకు పిర్యాదు చేశారు. ప్రాజెక్టుల్లో ఏ తీరుగా అవినీతి జరిగింది.. ఎంత మేర అవినీతి జరిగి ఉంటుందన్న వివరాలతో కూడిన వినతి పత్రాన్ని సీబీఐ అధికారులకు అందించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓ పెద్ద కంపెనీతో కలిసి టీఆర్ఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ఆమె సీబీఐకి ఫిర్యాదు చేశారు.

  ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నయ్యగా జగన్ కు తాను సాయం చేశానని.. తిరిగి వారు సాయం చేయాలని కోరుకోవడం లేదన్నారు. తన శక్తి మించే సాయం చేశాను అన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అవినీతితో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. ఏపీలో అవినీతి గురించి అక్కడి ప్రతిపక్షం మాట్లాడాలన్నారు. తనకు ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.   

  గతంలో ఎప్పుడూ ఆమె జగన్ పై నేరుగా విమర్శలు చేయలేదు.. పరోక్షంగానే మాట్లాడారు.. కానీ ఆమె ఇప్పుడు నేరుగా విమర్శలు చేయడం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే గతంలో అన్ని కార్యక్రమాలు కలిసే చేసిన ఈ ఇద్దరు.. అసలు  ఇప్పుడు ఎదురు పడడమే లేదు. తప్పని సరి పరిస్థితుల్లో ఒకే  దగ్గర ఉండాల్సి వచ్చిన సందర్భంలో మాట మాట కలపడం లేదు. తాజాగా ఆమె వ్యాఖ్యలు చూస్తే.. నేరుగా యుద్ధానికి దిగినట్టే అంచనా వేయాలి అంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, YS Sharmila

  ఉత్తమ కథలు