హోమ్ /వార్తలు /andhra-pradesh /

YS Sharmila: ఏపీ రాజకీయాలపై కుండబద్ధలు కొట్టిన వైఎస్ షర్మిల.. ఏమన్నారంటే..

YS Sharmila: ఏపీ రాజకీయాలపై కుండబద్ధలు కొట్టిన వైఎస్ షర్మిల.. ఏమన్నారంటే..

YS Sharmila on AP Politics: కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల తాను ఏపీలో పార్టీ పెట్టకూడదా ? అని చేసిన కామెంట్స్... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

YS Sharmila on AP Politics: కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల తాను ఏపీలో పార్టీ పెట్టకూడదా ? అని చేసిన కామెంట్స్... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

YS Sharmila on AP Politics: కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల తాను ఏపీలో పార్టీ పెట్టకూడదా ? అని చేసిన కామెంట్స్... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

  వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని నెలల క్రితం తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. ఆ తరువాత కరోనా కేసులు పెరగడంతో ఈ పాదయాత్ర వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడితే మళ్లీ పాదయాత్ర చేసేందుకు వైఎస్ షర్మిల సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల తాను ఏపీలో పార్టీ పెట్టకూడదా ? అని చేసిన కామెంట్స్... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. షర్మిల మళ్లీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేశారా ? అనే ఊహాగానాలు మొదలయ్యయి. షర్మిల మదిలో ఏపీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందని.. అందుకే ఆమె అలా అన్నారనే టాక్ వినిపించింది.

  అయితే ఎవరో అడిగిన ప్రశ్నకు షర్మిల సాధారణంగానే ఈ రకమైన సమాధానం చెప్పారని.. అసలు ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే ఆలోచన ఆమెకు లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఆ తరువాత షర్మిల మరోసారి ఏపీ రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో.. దీనిపై మళ్లీ ఎలాంటి చర్చ జరగలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు షర్మిల.. ఏపీ రాజకీయాలపై స్పందించే విషయంలో ఆచితూచి వ్యవహరించారు.

  ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా.. అతడిని ముందుగానే వారించారు షర్మిల. అసలు తనను ఏపీ గురించి ఏమీ అడగవద్దని ఈ అంశానికి అక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టారు. ఇలా చెప్పడం ద్వారా తాను ఏపీ రాజకీయాలపై ఆసక్తిగా లేనని.. గతంలో తన గురించి జరిగిన ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నట్టుగా కామెంట్ చేశారు.

  K ChandraShekar Rao: అప్పటివరకు మౌనమే.. సీఎం కేసీఆర్ అలా డిసైడయ్యారా ?

  Telangana Politics: రేవంత్ రెడ్డికి ఇప్పట్లో అలాంటి తలనొప్పులు లేనట్టేనా ?.. ఇదే మంచి అవకాశమా ?

  ఇక ష‌ర్మిల పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు మాత్రం పోంద‌లేదు. ష‌ర్మిల పార్టీ పెరు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వెంట‌నే ఆమే పార్టీని గుర్తించ‌వద్దని, అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ భాషా ఢిల్లి కోర్టులో ఫీర్యాదు చేశారు. మ‌రోవైపు ఎన్నిక‌ల సంఘానికి కుడా పార్టీకి గుర్తింపునివ్వడంపై త‌మకు అభ్యంతారాలు ఉన్నాయ‌ని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ పేరు మీద మ‌రో పార్టీ వ‌స్తే ప్రజల్లో గంద‌ర‌గోళం నెల‌కొంటుంద‌ని అయ‌న ఈసీకి వివ‌రించారు. అప్పటి నుండి ఇప్పటి వ‌ర‌కు ఈసీ ష‌ర్మిల పార్టీ గుర్తింపు గురించి పెద్దగా ముంద‌డుగు వేయ‌డం లేదు. ప్రతి నెల కొన్ని ప్రశ్నల‌తో లెట‌ర్లు మాత్రం రాస్తూ పార్టీ గుర్తింపు ప్రక్రియను పుర్తి చేయ‌డం లేదు.


  దీనిపై ష‌ర్మిల కుడా తీవ్ర అస‌హనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో త‌నపె కుట్ర కుడా ఉండొచ్చున‌ని వైఎస్ షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని షర్మిల విమర్శించారు.

  First published:

  Tags: Telangana, YS Sharmila

  ఉత్తమ కథలు