AP POLITICS YS SHARMILA GAVE STRONG COUNTER TO TELANGANA MINSTER KTR AFTER HE QUESTIONED IN AP ROADS AND POWER CUTS NGS
YS Sharmila Support CM Jagan: అన్నను అంటే చెల్లికి కోపం రాదా? కేటీఆర్ కు షర్మిల కౌంటర్
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)
YS Sharmila Support CM Jagan: ఆన్నా చెల్లిళ్ల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. ఇప్పటికు ఎవరి దారిలో వారు ప్రయాణిస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఎదురు పడడానికి కూడా ఇద్దరూ ఇష్టపడం లేదు.. కానీ అనూహ్యంగా ేశారు. ఏపీఅన్నపై వ్యాఖ్యలు చేసిన.. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై షర్మిల తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు.
YS Sharmila Support CM Jagan: వైఎస్ షర్మిల .. ఒకప్పుడు ఆమె అన్న విడిచిన బాణం.. కానీ ఇప్పుడు అన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగా పార్టీ పెట్టారు. వద్దు అని వారిస్తూన్నా సొంతగా రాజకీయ పార్టీ పెట్టారు. అప్పటి నుంచి ఇద్దరు ఎదురెదురు పడ్డానికి కూడా ఇష్టపడడం లేదు.. షర్మిల (Sharmila) ముందుగా వెళ్తే.. జగన్ (Jagan) అక్కడకు లేటుగా వెళ్తారు.. జగన్ అక్కడ ఉన్నారని తేలిస్తే. షర్మిల ఆలస్యంగా వెళ్తారు. కానీ అనూహ్యంగా ఆమె నుంచి అన్నకు సోపర్ట్ దొరికింది.. అది కూడా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minster KTR) ఏపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. విద్యుత్ లేదని.. రోడ్లు సరిగ్గా లేవని.. ఇలా ఆయన ఆరోపణలు చేయడంతో ఆయన కామెంట్లు వైరల్ గా మారాయి. తాజాగా వైఎస్ ఆర్ టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. మనమే సక్కగా లేనప్పుడు, పక్కవాడి మీద, అవతలి వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకని సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఇక్కడి సమస్యలను వదిలేసి ఏపీ సమస్యల గురించి ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం అని నిలదీసారు. పాదయాత్రలో బాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట నియోజకవర్గంలో ఆమె ప్రసంగించారు. ఆంధ్ర ప్రజల అంశం పక్కన పెడితే తెలంగాణ ప్రజలు ఎంత వరకు సంతోషంగా ఉన్నారని నిలదీసారు.
రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా..? పక్క రాష్ట్రం గురించి ఎందుకు అని కేటీఆర్ ను ప్రశ్నించారు. స్వార్థం కోసం అధికారంలోకి వచ్చారని, దరిద్రపు పాలన చేస్తున్నారని గులాబీ ప్రభుత్వంపై షర్మిళ నిప్పులు చెరిగారు. కసీఆర్ పాలన గొప్పతనం గురించి.. ఆయన కొడుకు కేటీఆర్ చెప్పడం కాదు.. ప్రజలు చెప్తున్నది వినండి.. పాలన ఎలా ఉంన్నది మీకు అర్థమవుతంది అన్నారు. సమస్యలు చూస్తుంటే అర్థం అవుతుందని ఎద్దేవా చేసారు. ప్రజలు అనేక సమస్యల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతుంటే పాలన గొప్పగా ఉందని చెప్పుకోవడానికి సిగ్గుండాలని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. కేటీఆర్ కు తెలంగాణలో ఫ్రెండ్స్ తక్కువ.. రాష్ట్రం మొత్తం మద్యం ఏరులై పారుతుందని, ఉద్యోగాలు లేక చదువుకున్న బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇదేనా మంచి పాలన.?అంతా దోచుకోవడం, దాచుకోవడం మాత్రవమేనని షర్మిల మండిపడ్డారు.
ఇక చిన్న దొర కేటిఆర్ కి ఆంధ్రలో ఫ్రెండ్స్ ఉన్నారట, ఇక్కడ ఎవరు లేరట., తెలంగాణ లో ఫ్రెండ్స్ ఉంటే మీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో అర్థం అయ్యేదని, తెలంగాణలో ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలు కేటిఆర్ కి ఫ్రెండ్స్ కాదట, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కాదు కాబోలని ఎద్దేవా చేసారు. ఇక్కడ స్నేహితులు ఉంటే సమస్యలు తెలుస్తాయి కాళ్ళు,చేతులు పోగొట్టుకున్న ఉద్యమ కారులు చాలా బాధ పడుతున్నారని, ఎందుకు ఉద్యమంలో పాల్గొన్నామ అని కుమిలిపోతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణలో అసలు ఉద్యమకారులను పట్టించుకొనే పరిస్థితులు లేవని, తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే ప్రజలు పడుతున్న ప్రతి బాధలు కేటీఆర్ కు తెలిసేవని, తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ ఆత్మహత్యలు కేటీఆర్ కంటికి కనిపించేవని షర్మిల అన్నారు. వడ్లు కొనక రైతులు పడుతున్న బాధలు కూడా కనిపించేవని చమత్కరించారు షర్మిల.మంత్రి కేటీఆర్ కు తెలంగాణలో ఉన్న స్నేహితుల కన్నా ఆంధ్రాలో స్నేహితులు ఎక్కువగా ఉన్నారని, అందుకే తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకన్నా ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు కేటీఆర్ కు ఎక్కువగా తెలుస్తున్నాయని షర్మిళ చురకలంటించారు. ఆంధ్రాలో నీళ్లు, కరెంట్, రోడ్ల అంశంలో కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నర్మగర్బంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.