హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan-Chandrababu: ఆ విషయంలో.. చంద్రబాబు ఆలోచనకు భిన్నంగా జగన్ వ్యూహం..

YS Jagan-Chandrababu: ఆ విషయంలో.. చంద్రబాబు ఆలోచనకు భిన్నంగా జగన్ వ్యూహం..

చంద్రబాబు, జగన్ (ఫైల్)

చంద్రబాబు, జగన్ (ఫైల్)

AP Politics: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తమదైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, వైసీపీ అధినేతలు.. వారసుల పోటీ విషయంలో మాత్రం భిన్నమైన స్టాండ్ తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  పైకి కనిపించకపోయినా.. ఏపీ రాజకీయాలు కూడా హాట్‌గా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలు సీరియస్‌గా కసరత్తు చేస్తున్నాయి. అధికారంలో వైసీపీ(ysrcp) ఇందుకోసం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ, వైసీపీ ఇప్పటి నుంచే అవగాహనకు వస్తున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబుకు భిన్నంగా జగన్ వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో యువతకు ఎక్కువగా సీట్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎక్కువమంది నాయకులు తమ వారసులను ఎన్నికల బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ఆలోచన వారికి కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  ఈసారి నేతల వారసులు పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు కూడా నిర్ణయించుకున్నారని.. అలా చేయడం వల్ల ఎక్కువమంది యువతకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని టీడీపీ అధినేత భావిస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్(Ys Jagan) మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచించడం విశేషం.

  తమ స్థానంలో వారసులను బరిలోకి దించాలని భావిస్తున్న నాయకులకు వైఎస్ జగన్ షాక్ ఇచ్చారు. అలాంటి నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ.. ఈసారి కూడా మీరే పోటీ చేయాలని జగన్ కచ్చితంగా చెప్పారు. కొందరు నేతలు ఈ విషయంలో సీఎం జగన్‌ను రిక్వెస్ట్ చేసినా.. ఆయన మాత్రం అందుకు ససేమిరా అనేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపాలని భావిస్తున్న అనేక మంది నేతలు నిరాశలో మునిగిపోయారు.

  KCR| Munugodu: మునుగోడుపై కేసీఆర్ భారీ ప్లాన్.. ఏకంగా అంతమంది ఎమ్మెల్యేలు రంగంలోకి..?

  Telangana : మండవ ఈసారి పోటీ చేయడం పక్కా .. ఏ పార్టీ నుంచంటే..?

  ఓ వైపు టీడీపీ నేతలు తమ వారసులను బరిలోకి దింపేందుకు పక్కాగా ప్లాన్ రెడీ చేసుకుంటుంటే.. తాము కూడా తమ వారసులను మళ్లీ వెయిటింగ్‌లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు నేతలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల సమయానికి జగన్ ఆలోచన మారే అవకాశం లేకపోలేదని.. అప్పటివరకు వేచి చూడాలని మరికొందరు నేతలు భావిస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తమదైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, వైసీపీ అధినేతలు.. వారసుల పోటీ విషయంలో మాత్రం భిన్నమైన స్టాండ్ తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu

  ఉత్తమ కథలు