హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jagan-Chandrababu: జగన్ ‘కుప్పం’పై కన్నేస్తే.... చంద్రబాబు ‘పులివెందుల’ ప్లాన్ చేస్తున్నారా ?

Jagan-Chandrababu: జగన్ ‘కుప్పం’పై కన్నేస్తే.... చంద్రబాబు ‘పులివెందుల’ ప్లాన్ చేస్తున్నారా ?

చంద్రబాబు, జగన్ (ఫైల్)

చంద్రబాబు, జగన్ (ఫైల్)

YS Jagan-Chandrababu: వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగరేలా చేస్తామని ఆ పార్టీ నేతల పదే పదే చెబుతున్నారు. చంద్రబాబును కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో వర్క్ కూడా చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కొద్దిరోజుల క్రితం ఏపీ రాజకీయాలు వన్ సైడ్‌గా సాగిపోయాయి. టీడీపీ, జనసేన సహా ఇతర విపక్షాలను అధికార వైసీపీ పూర్తిస్థాయిలో రాజకీయంగా డామినేట్ చేస్తూ వచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పూర్తి స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. దీంతో ఏపీ రాజకీయాల్లో వైసీపీ(ysrcp) రాజకీయ ఆధిపత్యం మరింతగా పెరిగిందనే వాదన వినిపిస్తోంది. కానీ ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు ఒక్కసారిగా సీన్ మారిపోయేలా చేశాయి. ఏపీలోని సగానికిపైగా నియోజకవర్గాలను కవర్ చేసే ఈ మూడు స్థానాల్లో టీడీపీ(tdp) విజయం సాధించింది. అందులో వైసీపీకి ఎంతో పట్టున్న రాయలసీమలోని జిల్లాలు కూడా ఉన్నాయి. జగన్ సొంత జిల్లా కడప(Kadapa) జిల్లాలో కూడా టీడీపీకి ఆధిక్యం రావడంతో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

ఈ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా విశ్లేషించాలనే దానిపై ఆ పార్టీ నేతలు ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫలితాల తరువాత పార్టీకి నష్టం కలుగకుండా ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఫలితాలు టీడీపీకి ఎంతో మనోధైర్యం తెచ్చిపెట్టాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కడప జిల్లాలోనూ తమకు ఆధిక్యత రావడంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగరేలా చేస్తామని ఆ పార్టీ నేతల పదే పదే చెబుతున్నారు.

చంద్రబాబును కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో వర్క్ కూడా చేస్తున్నారు. ఓ వైపు వైసీపీ నాయకత్వం కుప్పంలో చంద్రబాబు , టీడీపీని ఓడించేందుకు ప్లాన్ చేస్తుంటే.. పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలోనూ టీడీపీకి ఎక్కువ ఓట్లు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఫలితాలను బట్టి చూస్తుంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీకి అంతగా అనుకూలంగా లేవనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

YS Jagan: చంద్రబాబు చేసిన పెద్ద స్కామ్.. ఇవిగో ఆధారాలు.. అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Vizag AIrport: వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.240 కోట్లతో కొత్త టెర్మినల్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

మరోవైపు కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంటే.. తాము కష్టపడితే పులివెందులలో సీఎం జగన్‌ను ఓడించవచ్చని టీడీపీ భావిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గాల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవని.. ప్రజల్లోకి వెళితే టీడీపీకి పులివెందులలోనూ విజయం సాధించవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుంటే.. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu

ఉత్తమ కథలు