హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: స్పెషల్ స్టేటస్, 3 క్యాపిటల్స్ మద్యంపై జగన్ క్లారిటీ.. సారా బాబు అంటూ సెటైర్లు.. పవన్, బాలయ్యనూ వదలని సీఎం

YS Jagan: స్పెషల్ స్టేటస్, 3 క్యాపిటల్స్ మద్యంపై జగన్ క్లారిటీ.. సారా బాబు అంటూ సెటైర్లు.. పవన్, బాలయ్యనూ వదలని సీఎం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) లో కల్తీ మద్యం వ్యవహారంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. కల్తీ మద్యం విషయంలో ప్రభుత్వంపై టీడీపీ (TDP) సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ (AP CM YS Jagan) సభలో కీలక ప్రకటన చేశారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) లో కల్తీ మద్యం వ్యవహారంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. కల్తీ మద్యం విషయంలో ప్రభుత్వంపై టీడీపీ(TDP) సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ (AP CM YS Jagan) సభలో కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపిస్తున్న బ్రాండ్లన్నింటికీ టీడీపీ హాయంలోనే అనుమతులిచ్చారని జగన్ గుర్తు చేశారు. మద్యాన్ని హెల్త్ డ్రింక్ పేరుతో ప్రచారం చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబును ఇక నుంచి సారా చంద్రబాబుగా పిలవాలని ఎద్దేవా చేశారు. ఇక మద్యం ఉత్పత్తి చేస్తున్న సంస్థలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనేదే ప్రభుత్వం పట్టించుకుంటుందని.. వాటికి పవర్ స్టార్-999, లెజెండ్-999, బూమ్ బూమ్ పేరు పెడతారా అనేది సంబంధం లేదని జగన్ స్పష్టం చేశారు.

  ఇక ఏపీలో ఉత్పత్తయ్యే మద్యంలో హానికర రసాయనాలున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఎస్.డీ.ఎస్ ల్యాబుల్లో రిపోర్టులిచ్చారనడానికి ఆధారాలు లేవన్నారు. అలాగే మద్యం శాంపిల్స్ విషయంలోనూ క్లారిటీ లేదన్నారు. రాష్ట్రానికి ఆదాయం వస్తే జగన్ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తాడనే భయంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. శాంపిల్స్ లేదా రిపోర్టులను టాంపర్ చేసినట్లు అనుమానాలున్నాయన్నారు.

  ఇది చదవండి: వేసవిలో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. ఇంటింటికీ కుళాయి.. మంత్రి కీలక ప్రకటన

  తమ ప్రభుత్వంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతివ్వలేదని స్పష్టం చేసిన జగన్.. అదే మందు చంద్రబాబు హయాంలో తప్పుకాదన్నారు. మా హయాంలో అదే మద్యం ఉత్పత్తి అయితే అది విషంతో సమానమంటూ ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు జే బ్రాండ్స్ అంటున్న వాటిని బాబు బ్రాండ్స్ అనో.. బాబు బ్రాండ్స్ అనో.. ఎన్ బ్రాండ్స్ అనో, ఎల్ బ్రాండ్స్ అనో పిలిస్తే బాగుంటుందన్నారు.

  ఇది చదవండి: పార్టీ ఏదైనా.. ప్లాన్ ఒక్కటే.. వారి కోసం వందల కోట్లు.. వ్యూహం గిట్టుబాటు అవుతుందా..?

  ప్రెసిండెంట్ మెడల్ బ్రాండ్ కు 2018 ఫిబ్రవరిలో అనుమతిచ్చారని దీనికి టీడీపీ ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టాలని జగన్ ఎద్దేవా చేశారు. ఇక గవర్నర్స్ రిజర్వ్ బ్రాండ్ కు 2018 నవంబర్ 5వ తేదీన అనుమతులిచ్చారన్నారు. నెపోలియన్, ఆప్టన్, సెవెన్త్ హెవెన్, హైదరాబాద్ విస్కీ, రాయల్ ప్యాలెస్, బూమ్ బూమ్ బీర్, వంటి బ్రాండ్లకు టీడీపీ హయాంలోనే పర్మిషన్ ఇచ్చారంటూ తేదీలతో సహా జగన్ అసెంబ్లీ ముందుంచారు. స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ అనేవి లేకపోయినా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కావాలని స్టిక్కర్లు సృష్టించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని జగన్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్ చెబుతూ పవర్ స్టార్-999, బాలకృష్ణకు థ్యాంక్స్ చెబుతూ లెజెండ్-999 బ్రాండ్స్ తెచ్చారని ఎద్దేవా చేశారు. వీరికి థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు.. ఆయనకు మద్దతిచ్చే మీడియా సంస్థలను మాత్రం మర్చిపోయారన్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm ys jagan mohan reddy, Liquor

  ఉత్తమ కథలు