హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

3Years for YCP Government: సంక్షేమ పథంలో సవాళ్ల ప్రయాణం.. మూడేళ్లు పూర్తి చేసుకున్న జగన్ సర్కార్..

3Years for YCP Government: సంక్షేమ పథంలో సవాళ్ల ప్రయాణం.. మూడేళ్లు పూర్తి చేసుకున్న జగన్ సర్కార్..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సీఎం జగన్ (CM YS Jagan) ప్రభుత్వం ముచ్చటగా మూడేళ్ళ కాలాన్ని పూర్తిచేసుకుంది. ఈ మూడేళ్ళ వ్యవధిలో ప్రభుత్వం అనేక విజయాలతో పాటు అనేక సవాళ్ళని ఎదుర్కొంది.

  Anna Raghu, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సీఎం జగన్ (CM YS Jagan) ప్రభుత్వం ముచ్చటగా మూడేళ్ళ కాలాన్ని పూర్తిచేసుకుంది. ఈ మూడేళ్ళ వ్యవధిలో ప్రభుత్వం అనేక విజయాలతో పాటు అనేక సవాళ్ళని ఎదుర్కొంది. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగైదు నెలలకే కరోనా వైరస్ విజృంభించింది. దాదాపు సంవత్సరకాలం పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పూర్తిగా కరోనా నియంత్రణపైనే దృష్టిసారించవలసి వచ్చింది.పైగా కరోన సమయంలో అసలే అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మరింత దిగజారింది. అప్పటి నుండి అప్పులతోనే ప్రభుత్వం నెట్టుకొస్తుందని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తామంటూ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్, విధ్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష వంటి తొందరపాటు నిర్ణయాల వలన ప్రభుత్వానికి న్యాయస్థానాలలో మొట్టికాయలు పడేలా చేశాయి. అంతేకాక ప్రభుత్వ విధానాలకు జడిసి ఏ.పి లో ప్రభుత్వ కాంట్రాక్టులు అంటేనే గుత్తేదారులు ఎవరూ ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి.దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందనేది విశ్లేషకులు చేబుతున్నమాట.

  జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళవుతున్నా రాష్ట్ర ఆర్ధిక అభివృద్దికి తోడ్పడే పరిశ్రమ ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా తీసుకురాలేక పోయారని, కనీసం రాష్ట్రంలో రహదారులపై పడ్డ గుంతలలో మట్టిని కూడా వేయడం లేదని, ముఖ్యమంత్రి జగన్ కు పరిపాలన చేతకావడంలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

  ఇది చదవండి: పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్.? త్వరలోనే రంగంలోకి.. బాబు స్కెచ్ ఇదేనా..?


  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం రాబడికి మించిన ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతినెలా అందినకాడికి అప్పులు చేసి ప్రభుత్వం పెన్షన్లు సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు నిధులను భారీగా ఖర్చుచేయవలసి వస్తోంది. రుణపరిమితికి మించి అప్పులు చేయవలసిన దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు అనేకం.

  ఇది చదవండి: ర‌ఘురామ‌ కృష్ణంరాజు కుర్చీ వెనుకున్న కండువా క‌థేంటీ..? ఆ పార్టీకి సంకేతాలిస్తున్నారా..?


  ఆర్ధిక వనరుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని విలువైన భూములు ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను సైతం బ్యాంకులకు తనఖాలు పేడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రోజురోజుకీ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దిగజారుతుందే తప్ప మెరుగుపడని పరిస్థితి. సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కూడా చెల్లించలేనంతగా ఆర్ధిక ఇబ్బందులను ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇక ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవలసిన పరిస్థితి. దీంతో ఏపీలో ప్రభుత్వ పరంగా ఏవైనా పనులు చేయాలంటే బిల్లులు రావని కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి.

  ఇది చదవండి: సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్..! బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ..? త్వరలో కీలక ప్రకటన..


  ఇక ప్రభుత్వం ఇప్పటి వరకూ తీసుకున్న అనేక నిర్ణయాలు ఆవేశపూరితంగానో లేక అనాలోచితంగానో తీసుకున్న నిర్ణయాలగానే నిలిచిపోయాయని చెప్పాలి. అమరావతి తరలింపు, మూడు రాజధానుల వ్యవహారం, పోలవరం రివర్స్ టెండరింగ్, విధ్యుత్ పి.పి.ఏ ల పునఃసమీక్ష, సీ.పీ.ఎస్ రద్దు, మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, గత ప్రభుత్వాలు ఇచ్చిన గృహరుణాలపై తీసుకువచ్చిన ఓ.టి.ఎస్ వసూళ్ళు, మండలి రద్దు తీర్మానం ఇలా చేప్పుకుంటూ పోతే ప్రభుత్వం చేతులు కాల్చుకున్న నిర్ణయాలు అనేకం.

  ఇది చదవండి: వైసీపీకి ఆదాయం ఎక్కువ... వ్యయం తక్కువ.., టీడీపీ పరిస్థితి రివర్స్..


  సంక్షేమం తప్ప రెండవ మాట పట్టని జగన్ సర్కార్.., ప్రభుత్వం వీటి అమలుకోసం అనేక రకాలుగా ప్రజలపై పన్నుల భారం మోపుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ పై అదనపు సుంకం, చెత్తపై పన్ను, విధ్యుత్ ట్రూఅప్ ఛార్జీలు, ఓటీఎస్ వసూళ్ళు, భారీగా పెంచిన రిజిష్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ కూడా సంక్షేమపథకాల అమలుకు సరిపోవడం లేదని, సామాజిక, వృద్ధాప్య పెన్షన్లు మినహా అమ్మఒడి, ఆసరా, విద్యాదీవెన వంటి పథకాలను అరకొర అమలు చేస్తున్నారనే వాదనా లేక పోలేదు. దీనికి తోడు ప్రభుత్వం ఆర్ధిక భారం తగ్గించుకునే చర్యలలో భాగంగా నెలనెలా వివిధ పథకాల లబ్ధిదారుల జాబితా కుంచించుకు పోతుందనే ఆరోపణలూ ఉన్నాయి. పైగా ఇటువంటి ఉచితపధకాలపై పన్ను చెల్లింపు దారులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాము చెల్లించే పన్నులు రాష్ట్ర అభివృద్ధికి ఖర్ఛు పెట్టాలి తప్ప ప్రభుత్వం తన ఓటు బ్యాంక్ కోసం ప్రజల సొమ్మును పప్పూ బెల్లాలలాగా పంచేయటం ఎంతవరకు సబబు అనేది వారి వాదన.

  ఇది చదవండి: నారా లోకేష్ సంచలన నిర్ణయం.. పార్టీ పదవికి రాజీనామా.? ఆ నేతలకు నో టికెట్..


  ఇక పార్టీలో కూడా జగన్ కు మునుపటి లాగా పట్టు ఉందని చెప్పలేని పరిస్థితి. గతంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మారు మాట్లాడలేని పరిస్థితి, కానీ ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణతో పార్టీలో అసమ్మతులు బయట పడ్డాయి. జగన్ కు వీరవిధేయులు వంటి నేతలే జగన్ తీసుకున్న నిర్ణయాలను బహాటంగానే వ్యతిరేకించారు. ఇప్పుడంటే అధికారం ఉందని కోంతమేర నిదానించిన రాబోవు ఎన్నికల నాటికి జగన్ పై అసంతృప్తులు గట్టిగానే గళం విప్పే అవకాశం లేక పోలేదు.

  ఇది చదవండి: ఇకపై ఆంధ్రాలో చికెన్ దొరకదా..! త్వరలోనే లాక్ డౌన్..? కారణం ఇదే..


  ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే జగన్ మూడేళ్ళ పాలనలో సంక్షేమం తప్ప అభివృద్ధి శూన్యం.ఇలానే సంక్షేమం అమలు చేసుకుంటూ పోతే రాష్ట్రం దివాళా తీస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాటల్లో నిజం లేక పోలేదు.ఏ వ్యవస్థ ఐనా సరే మనుగడ సాధించాలంటే ఆదాయ వ్యయాల విషయంలో కొంతమేర పరిమితులు పాటించవలసిన అవసరం ఉంది.అలాకాదని ఆదాయానికి మించి అప్పులు చేసిమరీ ఖర్ఛు చేస్తే మాత్రం ఎంతటి వ్యవస్థలైనా కుప్పకూలడం ఖాయం. సంక్షేమ పధకాలు అమలు చేయడమంటే "పులి మీద సవారీ" లాంటి దనే విషయం అర్ధమయ్యే సరికి పుణ్యకాలం కాస్తా పూర్తి కావచ్చింది. మరో ఏడాదిలో ప్రజలు పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోతారు. ఈ లోపు ప్రభుత్వం ఎంతోకొంత అభివృద్ధిని ప్రజలకు చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, Ysrcp

  ఉత్తమ కథలు