హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్న జగన్.. ఈసారి కూడా వర్కవుట్ అవుతుందా..?

YS Jagan: మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్న జగన్.. ఈసారి కూడా వర్కవుట్ అవుతుందా..?

ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జగన్ నగదు జమ చేస్తారు. మరోవైపు.. వైయస్సార్‌ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) సమావేశంలోనే చర్చించి ఆమోదం తెలిపింది.

ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జగన్ నగదు జమ చేస్తారు. మరోవైపు.. వైయస్సార్‌ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) సమావేశంలోనే చర్చించి ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ (CM YS Jagan) అధికారం చేపట్టిన తర్వాత తన దృష్టంతా పూర్తిగా పరిపాలనపైనే కేంద్రీకరించారు. పార్టీ గురించి పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు. గడచిన మూడేళ్ళుగా వైసీపీ (YSRCP) ప్లీనరీ నిర్వహించకపోవడం ఇందుకు ఉదాహరణగా చూపిస్తారు.

ఇంకా చదవండి ...

  Anna Raghu, News18­, Guntur

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ (CM YS Jagan) అధికారం చేపట్టిన తర్వాత తన దృష్టంతా పూర్తిగా పరిపాలనపైనే కేంద్రీకరించారు. పార్టీ గురించి పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు. గడచిన మూడేళ్ళుగా వైసీపీ (YSRCP) ప్లీనరీ నిర్వహించకపోవడం ఇందుకు ఉదాహరణగా చూపిస్తారు రాజకీయ విశ్లేషకులు. ఐతే ఉన్నఫళంగా జగన్ గడచిన మూడు నాలుగు రోజులుగా పార్టీపై ధృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తుంది. ఇకపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించడం, ఈ ఏడాది జూలైలో పార్టీ ప్లీనరీ జరపాలని నిర్ణయించడం, అలాగే పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు వైసీపీ ట్రబుల్ షూటర్ విజయ సాయిరెడ్డికి అప్పగించడం వంటి పరిణామాలు చూస్తుంటే జగన్ పార్టీ కార్యకలాపాలపై కొంతమేర ధృష్టి సారించినట్లే కనిపిస్తోంది.

  గత సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ (Janasena Party) ఆవిర్భావసభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేలా కృషిచేస్తామని చెప్పి సంచలనం రేపారు. 2014 ఎన్నికలలో బీజేపీ-జనసేన-టీడీపీ లు కలిసికట్టుగా పోటీ చేయడంతో అప్పటి వరకు అధికారం ఖాయం అనుకున్న జగన్ ను ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అదే మూడు పార్టీలు 2019లో విడివిడిగా పోటీచేసి ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికలలో జగన్ భారీ మెజారిటీతో అధికారం చేపట్టారు.

  ఇది చదవండి: ఆ విషయంలో తగ్గేదేలేదంటున్న సీఎం జగన్.. ఈనెల 21న ముహూర్తం..? 

  2014 కు ముందే జగన్ కు ప్రజలలో విపరీతమైన క్రేజ్ తో పాటు ఆయన తండ్రి వైఎస్ఆర్ మరణం పట్ల విపరీతమైన సానుభూతి కూడా ఉంది. అంతటి పాజిటివ్ వేవ్ లో కూడా వైరిపక్షాల ఐక్యమత్యం తనను ఓడించిన విషయాన్ని జగన్ మర్చిపోయిఉండక పోవచ్చు. పైగా అప్పటికీ ఇప్పటికీ ఎంత ఓటుబ్యాంక్ తనవైపు పోలరైజ్ అయ్యిందో అనే అనుమానం జగన్ లో ఉండి ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది. ఎన్ని పథకాలు అమలుచేసినా రేపు అవతలి వర్గం కొత్తగా మరింత మెరుగైన పధకాలతో వస్తే జనం తనవెంటే ఉంటారనే గ్యారెంటీ లేదు.

  ఇది చదవండి: అది జె బ్రాండ్ స్లో పాయిజన్.. ఆయన సంపాదన 25వేల కోట్లు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..

  అందుకే ఇప్పటి నుండే తన శాసన సభ్యులు పార్టీ నాయకులను నిత్యం ప్రజలలో ఉంటూ వారికి ప్రభుత్వం నుండి అందుతున్న వివిధ పధకాల గురించి వివరించాలంటూ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే తన ఓటుబ్యాంక్ ను పదిలం చేసుకునే ఆలోచనతో జగన్ అడుగులు పడుతున్నాయని, ప్రశాంత్ కిశోర్ టీమ్ కూడా జగన్ ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఐతే 2019 ఎన్నికల ముందు కూడా గడగడపకు వైసీపీ పేరుతో పార్టీ నేతలు విస్తృతంగా గ్రామాల్లో పర్యటించడం పార్టీకి కలిసొచ్చింది. మరి ఇప్పుడు అదే పాలసీ వర్కవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు