Home /News /andhra-pradesh /

AP POLITICS YOUTH LEADERS FULL JOSH IN TELUGU DESAM PARTY MAHANADU WHAT IS THE REASON BEHIND NGS BK

Mahanadu: పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లు.. అధికార పార్టీకి వార్నింగ్ లు.. టీడీపీ యువ నేతల జోష్ కారణం ఇదే?

టీడీపీలో యువ నేతల జోష్

టీడీపీలో యువ నేతల జోష్

Mahanadu: తెలుగు దేశం పార్టీ లో యువ నేతల జోష్ పెరిగింది. మహనాడులో అయితే పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లో చెలరేగిపోయారు.. అధికార వైసీపీకి వార్నింగ్ లు కూడా ఇచ్చారు.. ఇంతలా యువ నేతల జోష్ కు కారణం ఏంటో తెలుసా..?

    M BalaKrishna, Hyderabad, News18.

    Telugu Desam Youth Leaders:  తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) లో గతంలో ఎన్నడూ లేని విధంగా యువ లీడర్లు (Youth Leaders) మెరుస్తున్నారు. తాజాగా మ‌హానాడు (Mahanadu) వేధిక‌గా త‌ళుక్కుమ‌న్న యువ నేత‌లు? స్పీచ్ లతో దుమ్ముదులిపారు. దీంతో తెలుగు తమ్ముల్లు ఫుల్ జోష్ లో ఉన్నారు.  ఇప్ప‌టికే అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) ఎక్క‌డికి వెళ్లిన ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ నేప‌ధ్యంలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చిన త‌మ‌దే విజ‌యం అనే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.  టీడీపీ (TDP) నిర్వ‌హిస్తోన్న మ‌హానాడుకు సైతం ఊహించని  స్పందన వస్తోంది. ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న రావ‌డంతో తెలుగు తమ్ముళ్లు ఫుల్ ఆనందంలో ఉన్నారు. త‌న 40 ఏళ్ల రాజ‌కీయ అనుభంలో ఎన్నో మ‌హానాడులు చూశాన‌ని కాని ఈ సారి వచ్చినంత  రెస్పాన్స్  రాలేద‌ని చంద్ర‌బాబు వెధిక‌పైనే చెప్ప‌డం  చ‌ర్చినీయాంశమైంది. మ‌రో వైపు ప్ర‌తి మ‌హానాడు స‌మ‌యంలో కొంత మంది యువ నేత‌లు త‌ళ‌క్కు మ‌న‌డం సాదారణంగా కొన‌సాగుతూ వ‌స్తోంది. ఆలా త‌ళుక్కు మ‌న్న యువ నేత‌లు త‌రువాత పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు కూడ నిర్వ‌హించారు. అలా వ‌చ్చిన వారిలో ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహానాయుడు (Rammohan Naidu) కూడా ఒక‌రు మ‌హానాడులో రామ్మోహాన్ నాయుడు ఇచ్చిన స్పీచ్ కు గతంలో చంద్ర‌బాబు పిథా అయి.. ఆయ‌న కు తరువాత పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించారు. మొన్న‌టికి మొన్న ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తోన్న విడ‌ద‌ల ర‌జిని కూడా మ‌హానాడు లో బాబు మందు ఇచ్చిన స్పీచ్ తోనే హైలెట్ అయ్యారు. అంత‌టి ప్రాముఖ్య‌త ఈ మ‌హానాడుకు ఉంటుంది. నేత‌లు త‌మ పిల్ల‌ల‌ను రాజ‌కీయంగా ప‌రిచ‌యం చేయాలకున్న‌ప్పుడు మ‌హానాడు వేధ‌క‌ను వాడుకుంటున్నారు.

    అందుకే యువ నేతలు ఇక్క‌డ నుంచే బాబు దృష్టిలో, ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డ‌తారు. నిర్వ‌హించిన మ‌హానాడులో కూడా చాలా మంది నేత‌ల కొడుకులు, కూతుళ్లు హైలెట్ అయ్యారు వారిలో ముఖ్యంగా ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ లో స్పీక‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన ప్ర‌తిభ భార‌తీ కుమార్తె గ్రీష్మ త‌న స్పీచ్ తో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నారు. వైసీపీ అన్యాయాలును త‌న‌దైన శైలీలో ఎండ‌గ‌ట్టి త‌ల్లి కి త‌గ్గ త‌న‌యురాలు అనిపించుకున్నారు. గ్రీష్మ ఇచ్చిన స్పీచ్ కు చంద్ర‌బాబు, లోకేష్ కూడా చాలా ఇంప్రెస్ అయిన‌ట్లు స‌మ‌చారం.

    ఇదీ చదవండి : తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తులు.. ఎందుకంత డిమాండ్?

    గ్రీష్మ‌తోపాటు అయ్య‌న్న‌పాత్ర‌డు కూమారుడు కూడా త‌న దైన శైలీలో ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్టి హెలైట్ అయ్యారు. ఇలా నేత‌ల కుమార్తెలు, కుమారులు త‌మదైన శైలీలో ప్ర‌సంగించి తామే భ‌విష్య‌త్ లో టీడీపీని న‌డిపించ‌బోయే నేత‌ల‌ని నిరూపించుకున్నారు. మ‌రో వైపు గ‌తంలో సోష‌ల్ మీడియాలో హైలెట్ అయిన కొంద‌రితో కూడా మ‌హానాడు వేధిక‌పై మాట్లాడించారు ప్ర‌సంగాలు కూడా చాలా ఆక‌ట్టుకున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు