హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking: వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి డెడ్ బాడీ.. అర్ధరాత్రి ఏం జరిగింది..?

Breaking: వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి డెడ్ బాడీ.. అర్ధరాత్రి ఏం జరిగింది..?

ఎమ్మెల్సీ అనంతబాబు (ఫైల్)

ఎమ్మెల్సీ అనంతబాబు (ఫైల్)

కాకినాడ జిల్లా (Kakinada District) లో కలకలం రేగింది. ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantababu) కారులో యువకుడి మృతదేహం ఉండటం సంచలనం సృష్టించింది. నిన్న అనంతబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అనుచరులు పార్టీలో మునిగితేలారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాకినాడ జిల్లా (Kakinada District) లో కలకలం రేగింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (YCP MLC Anantababu) కారులో యువకుడి మృతదేహం ఉండటం సంచలనం సృష్టించింది. నిన్న అనంతబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అనుచరులు పార్టీలో మునిగితేలారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఐతే మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు నేరుగా సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకెళ్లగా.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యం గతంలో అనంతబాబు వద్ద డ్రైవ్ గా పనిచేశాడు. నిన్న రాత్రి ఎమ్మెల్సీ అనుచరులు సుబ్రమహ్మణ్యంను తీసుకెళ్లారని.. వాళ్లే తమ కొడుకును హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రాత్రి పదిన్నర సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని.. ఒంటిగంట సమయంలో బైక్ ప్రమాదంలో మృతి చెందినట్లు ఎమ్మెల్సీ చెబుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే మృతదేహాన్ని తీసుకొచ్చిన అనంతబాబును సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తుండగా.. ఎమ్మెల్సీనే కొట్టిచంపారని కుటుంబ సభ్యులంటున్నారు.

ఇది చదవండి: భార్యపై ప్రేమతో అత్తపై కోపం.. అల్లుళ్లు ఏం చేశారో చూడండి..


గురువారం అనంతబాబు పుట్టిన రోజు కావడంతో అనుచరులంతా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో ఏదైనా గొడవ జరిగిందా.. లేక మరేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది. గతంలో పనిచేసిన డ్రైవర్ ను స్వయంగా ఎమ్మెల్సీనే వచ్చి తీసుకెళ్లి.. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పడం అనుమానాస్పదంగా ఉంది. పార్టీ జరుగుతుండగా టిఫిన్ కోసం సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడని... అప్పుడు యాక్సిడెంట్ జరిగిందని ఎమ్మెల్సీ చెబుతున్నారు. పార్టీలో భోజనం లేక టిఫిన్ కోసం బయటకు వెళ్లాడని చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.


ఇది చదవండి: వీడిన అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీ.. గోడదూకి ఎక్కడికెళ్లారంటే..!


సుబ్రహ్మణం డెడ్ బాడీపై మట్టి, కాళ్లు చేతులు విరిచేసిన ఆనవాళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాము మాట్లాతుండగా దీన్ని ఇష్యూ చేయవద్దని అనంతబాబు అన్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం ఆరు నెలల క్రితం అనంతబాబు దగ్గర ఉద్యోగం మానేశాడు. ఐతే గతంలో ఎమ్మెల్సీ వద్ద కొంత డబ్బు తీసుకున్నారని.. ఆ డబ్బు కోసం తరచూ ఫోన్ చేస్తుండేవారని కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kakinada, Ysrcp

ఉత్తమ కథలు