హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Politics: వచ్చే ఎన్నికల్లో సమరానికి సై అంటున్న వారసులు.. రేసులో ఉన్నది వీరే..

YCP Politics: వచ్చే ఎన్నికల్లో సమరానికి సై అంటున్న వారసులు.. రేసులో ఉన్నది వీరే..

వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వారసులు

వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వారసులు

YCP Politics: ప్రస్తుతం అన్ని పార్టీలు యువజపం చేస్తున్నాయి.. తెలుగు దేశం పార్టీ సైతం ఈ సారి 70 శాతం సీట్లు యువతకే అని బహిరంగంగానే ప్రకటించింది. అయితే అందుకు ధీటుగానే వైసీపీ కూడా అడుగులు వేస్తోంది. సిట్టింగ్ లో చాలామందికి సీటు గండం ఉండడంతో అంతా వారసులను తెరపైకి తెస్తున్నారు.

ఇంకా చదవండి ...

    YCP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి. ఇదే సమయంలో అన్ని ప్రధాన పార్టీలు యువ జపమే చేస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ (TDP) అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించింది. 70 సీట్లను యువతకే ఇచ్చే అవకాశం ఉంది. ఇటు వైసీపీ (YCP) సైతం అదే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నా.. మెరుగైన ప‌నితీరు క‌న‌ప‌ర‌చ‌క‌పోయినా ఇదే చివ‌రి అవ‌కాశ‌మ‌ని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ఎమ్మెల్యేల‌కు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. తాజాగా జ‌రిగిన వ‌ర్క్ షాప్ లో కూడా ఆయ‌న ఇదే విష‌యాన్ని స్పష్టం చేశారు అధినేత జగన్. ఎమ్మెల్యేల‌పై వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త ప్ర‌భుత్వంపై ప‌డ‌కుండా జ‌గ‌న్ ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త‌వారిని బ‌రిలోకి దింప‌డానికి సిద్ధ‌మవుతున్నారు. పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు కొంద‌రు ఈసారి ఎన్నిక‌ల్లో త‌మ‌కు బ‌దులుగా త‌మ వార‌సుల‌కు సీటివ్వాల‌ని ముఖ్య‌మంత్రిని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆయ‌న స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ నేత‌లంతా త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేస్తున్నారు. ఇప్ప‌టి నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వార‌సులు ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

    ప్రస్తుత మంత్రులు.. మాజీ మంత్రులు సైతం తమ వారసులను తమ తరపున దించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ వార‌సులు పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. వీరిద్ద‌రూ రాబోయే ఎన్నిక‌ల్లో పోటీనుంచి త‌ప్పుకోవాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రికి తెలిపారు. అలాగే స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వార‌సుడు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మ‌చిలీప‌ట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పోటీచేస్తారంటూ అక్క‌డి ప్లీన‌రీకి వెళ్లిన మాజీ మంత్రి కొడాలి నాని బహిరంగంగానే ప్రకటించారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణారావు త‌న త‌న‌యుణ్ని ఈసారి ఎన్నిక‌ల్లో రేప‌ల్లె నుంచి బ‌రిలోకి దింపాల‌నే యోచ‌న‌లో ఉన్నారు.

    ఇక తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి త‌న కుమారుడు అభిన‌య్‌ను బ‌రిలోకి దింప‌బోతున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గం మొత్తం అభిన‌య్ చుట్టేస్తున్నారనే ప్రచారం ఉంది. గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా ఈసారి ఎన్నిక‌ల్లో త‌న కుమార్తె ఫాతిమాను పోటీచేయించాల‌నే యోచ‌న‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

    ఇదీ చదవండి : సొంత సామాజిక వర్గానికే ఓటు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో తొలిసారి వైసీపీ.. నిర్ణయానికి కారణం ఇదే

    అలాగే బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, చెన్న‌కేశ‌వ‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌లంతా.. ఈ సారి త‌మ త‌మ వార‌సుల‌ను పోటీలోకి దింప‌డమే మేలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి వీరందరికీ సీఎం జగన్ నుంచి హామీ దొరికిందా లేదా అన్నది చూడాలి.

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

    ఉత్తమ కథలు