Byreddy Sidharth Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఆ యువ నేత హాట్ టాపిక్ అవుతున్నారు.. ఆయన సీఎం జగన్ (CM Jagan) కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. వైసీపీలో చేరి తక్కువ కాలమే అయినా.. టెకెట్ ఆశించకుండా.. అధినేత ఆదేశాల మేరకు మరొకరి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు సక్సెస్ అయ్యారు కూడా.. కానీ పదవి కోసం ఏ నాడు అధినేతను అడగలేదు. అలాంటి నేత ఇప్పుడు టీడీపీ గూటికి చేరతున్నారనే వార్త వైరల్ అవుతోంది. మరోవైపు అధికార పార్టీ నుంచి .. టీడీపీ (TDP) లోకి వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న సమయంలో.. వైసీపీ (YCP) యువ నేత.. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నేత వ్యవహారం సంచలనంగా మారింది. సోషల్ మీడియా స్టార్, వైఎస్ఆర్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఏపీ శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి (Byreddy Sidharth Reddy) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయన ఓ కీలక భేటీకి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
గత కొన్ని రోజుల నుంచి శాప్ ఛైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారని.. త్వరలోనే టీడీపీ కండువా కప్పుకుంటారనే వార్త హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డికి విభేదాలు బహిరంగ రహస్యమే కాగా.. తాజాగా ఓ పరిణామం చర్చకు దారితీసింది.. కీలకమైన శాప్ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో చేరి ఆయన.. శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటారని చర్చ సాగింది కూడా.. అయితే, ఈ ప్రచారంపై సీరియస్‌గా స్పందించారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి..
ఇదీ చదవండి : ఏపీ సర్కార్ కు షాక్.. నేను లోకల్.. ఎవర్నీ వదలను.. ఏబీ వార్నింగ్ ..!
తాను నారా లోకేష్‌ను కలిసింది ఎవరు చూశారో.. ఆధారాలు ఉంటే తీసుకు రండి అని నిలదీశారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. ఇక, టీడీపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్ స్థానిక ప్రోటోకాల్ అని.. తనది రాష్ట్రవ్యాప్త ప్రోటోకాల్ అన్నారు. అందుకే ఇద్దరం కలువలేకపోతున్నాం అని క్లారిటీ ఇచ్చారు. అమ్మ ఒడి, నాడు-నేడు.. ఇలా ఎమ్మెల్యే చేసే పనులకు తనకు సంబంధం లేదన్నారు సిద్ధార్థరెడ్డి. మరోవైపు, నందికొట్కూరు అభివృద్ధి కోసం 16 కోట్ల రూపాయలు మంజూరు చేయించానని తెలిపారు.. టీడీపీ హయాంలో రోడ్డు విస్తరణలో నష్టపోయిన షాపు యజమానులకు పరిహారం ఇవ్వకుండా దోచుకొని దాచుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన వివరణతో టీడీపీలోకి చేరుతారనే ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nara Lokesh, Ycp