Home /News /andhra-pradesh /

AP POLITICS YCP YOUNG LEADER BYREDDY SIDDHART REDDY SUPER STEPS FOR HERO MEGA POWER STAR RAMCHAARAN NGS

Byreddy Siddharth Reddy: రామ్ చరణ్ ను దింపేసిన వైసీపీ యూత్ లీడర్.. లైలా ఓ లైలా అంటున్న బైరెడ్డి

రామ్ చరణ్ ను దింపేసిన బైరెడ్డి

రామ్ చరణ్ ను దింపేసిన బైరెడ్డి

Byreddy Siddharth Reddy: వైసీపీ నేతల్లో జగన్ తరువాత అంత్యత ఫాలోయింగ్ ఉన్న యువ నేతల్లో బైరెడ్డి సిద్ధార్థ్ర్ రెడ్డి ఒకరు. తన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు తనలో ఉన్న మరో టాలెంట్ ను బైరెడ్డి బయటపెట్టారు.

ఇంకా చదవండి ...
    Byreddy Siddhartha Reddy:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి (Byreddy Siddhartha Reddy)కి మంచి క్రేజ్ ఉంది. మాస్ ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్న యువ లీడర్లలో బైరెడ్డి ఒకరు.   పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్‌తో  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. అన్నిటికంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అంతే ప్రత్యేక అభిమానం ఉన్న నేతగా వైసీపీలో గుర్తింపు పొందారు. అంతేకాదు బైరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ కు కూడా అంతే అభిమానం ఉంది. అందుకే ఆ మధ్య ఆయనకు శాప్ ( ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ) చైర్మన్ పదవి బాధ్యతలు అప్పచెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా (Kurnool District) నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు.

    ఆ విషయాన్ని ఎప్పుడు జనగ్ గుర్తు పెట్టుకుని మరి చెబుతారు. పార్టీలో చేరిన అనతి కాలంలోనే అధినేత జగన్ కు ఎంతో దగ్గర అయిన ఆ క్రేజ్ కర్నూలులో మామూలుగా ఉండదు.. ఆయన కనిపిస్తే మాస్ జాతరే అంటారు అతడి అభిమానులు. కేవలం రాజకీయాల్లో ప్రత్యర్థులపై పంచ్ డైలాగ్ లు పేల్చడమే కాదు.. మరో టాలెంట్ ను కూడా ఆయన బట్ట పెట్టారు.. అచ్చం రామ్ చరణ్ లా లైలా ఓ లైలా పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. దీంతో ఆయన అభిమానులు అన్నా నువ్వు సూపర్ అంటూ పొంగిపోతున్నారు.

    కాగా సిద్దార్థ మాట్లాడిన ఇంటర్వ్యూలు, వీడియోలు కూడా ఎప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంటూ ఉంటాయి.  ఈ క్రమంలోనే తాజాగా సిద్దార్థ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు బైరెడ్డి. వీడియోను బట్టి చూస్తే.. ఇది అతను టీనేజ్‌లో ఉన్నప్పుడు చిత్రీకరించిందిగా తెలుస్తుంది. ఎప్పుడు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసే బైరెడ్డిలోని ఈ టాలెంట్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అన్న ఇంత మంచి డ్యాన్స్ రా.. మాకు తెలీదే అంటూ సంబర పడిపోతున్నారు.

    ఇదీ చదవండి : గెలిపించినందుకు ఇదే మీకు కానుక.. వారిపై వరాలు కురిపించిన విజయసాయి రెడ్డి

    ఆ మధ్య   సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా  తనకున్న అభిమానాన్ని వెరైటీగా చాటుకుని అప్పుడు వార్తల్లో నిలిచారు.  విశాఖ (Visakha)లోని రుషికొండలో స్కూబా డైవింగ్ (Scuba Diving) చేసిన బైరెడ్డి, సముద్రం లోతుల్లోకి వెళ్ళి సీఎంకు ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు సూపర్ డ్యాన్స్ స్టెప్పులతో మరోసారి వార్తల్లో నిలిచారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు