హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: పవన్ కోసం అన్ని కోట్ల సుపారీనా..? స్పాన్సర్ ఎవరు? రాష్ట్రం రావణకాష్టం అవుతుందంటూ వార్నింగ్

Pawan Kalyan: పవన్ కోసం అన్ని కోట్ల సుపారీనా..? స్పాన్సర్ ఎవరు? రాష్ట్రం రావణకాష్టం అవుతుందంటూ వార్నింగ్

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా..? ఇప్పటికే హత్య చేయాలి అంటూ భారీగా సుపారీ ఇచ్చారా.. అన్ని కోట్ల డీల్ జరిగిందా..? మరి దీని వెనుక ఉన్నది ఎవరు..? జనసైనికుల అనుమానాలు ఏంటి..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Pawan Kalyan: జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హత్యకు కుట్ర జరుగుతోందా? ఆయన్ను హత్య చేయాలి అంటూ భారీగా డీల్ జరిగిందా..? మరి ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు...? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఈ విషయం పెను సంచలనంగా మారింది.. గత రెండు రోజుల నుంచి పవన్ ఇంటి దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇది ఏదో ఆకతాయి పని కాదని.. కుట్రలో భాగంగానే పవన్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారని.. తమ అధినేత హత్యకు భారీ కుట్ర జరుగుతోందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై కుట్ర ఇప్పటిది కాదని.. చాలా రోజులుగా దీని వెనుక స్కెచ్ ఉంది అని మండిపడుతున్నారు.

పవన్ ను హత్య చేసేందుకు భారీగా సుపారీ తీసుకున్నారని నిఘా వర్గాల సమాచారం ఉందని అనుమానిస్తున్నారు. పవన్ ఇంటిదగ్గర కనిపించిన వీడియోలో ఏపీలోని రెడ్డి కార్పొరేషన్ కు చెందిన కారు కూడా కనిపించింది. అందుకే దీనికి వెనుక ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ హస్తం ఉందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఎవరైన పవన్ ను టచ్ చేస్తే.. రాష్ట్రాన్ని రావణకాస్టంగా మార్చేస్తామంటూ జనసైనికులు హెచ్చరిస్తున్నారు.

పవన్ ను హత్య చేయడానికి 250 కోట్ల రూపాయల డీల్ కుదిరిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆగస్ట్ 19న కడప జిల్లా సిద్ధవటంలో హత్య చేయడానికి ప్రయత్నించారని.. ఆగస్ట్ 19న కడప జిల్లా సిద్దవటంలో జరిగిన రైతుభరోసా సభలో కిరాయి హంతకులు సంచరించినట్లు నిఘా వర్గాలు కూడా తెలిపాయన్నారు. పవన్ సిద్ధవటం వెళ్తుండగా కాన్వాయ్ లో ఒక గుర్తు తెలియని వాహనం ప్రవేశించేందుకు ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు.

ఇటీవల ఓ రాష్ట్రంలో జరిగిన ఒక క్లోజ్డ్ గ్రూపు మీటింగ్ లో అన్నా అతనని చంపేయడన్నా.. అతన్ని భరించలేకపోతున్నాం అని ఒక నాయుడు అన్నట్టు తమకు సమాచారం అందింది అంటున్నారు. అలాగే బెంగళూర్ చెన్నై నగరాల్లో ఒక వర్గం వారు పలు ధపాలు సమావేశమైనట్టు తెలిసింది. మన ఆధిపత్యం పోకూడాదు.. అందుకు అవసరమైన నిధులు యు.ఎస్ నుంచి కూడా పంపుతామని ఒక ఎన్ఆర్ఐ ఫోన్ సంభాషనలు కూడా నిఘా వర్గాల దగ్గర ఉన్నాయి అంటున్నారు.

ఈ కుట్రకు సంబంధించి పూర్తి సమాచారం ఏపీ నిఘా వర్గాల వారి దగ్గర ఉన్నా.. వారు స్పందించడం లేదని.. ఇదంతా ఏపీలో అధికార వైసీపీకి తెలిసేలా జరుగుతోందని జనసైనికులు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కు పటిష్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర..? ప్రతిపక్షాన్ని చీల్చుతారా..? బీజేపీ ప్లాన్ ఏంటి..?

పవన్ ఇంటి దగ్గర రెక్కీ విషయంలో విపక్షాలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నేతలు సైతం.. పవన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. ఇక జనసేన నాయకులు అయితే.. కేంద్ర బలగాలతో పవన్ కు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Janasena, Pawan kalyan